Moviesఅఖిల్ పెళ్లి విష‌యంలో అక్కినేని ఫ్యామిలీలో ఈ గొడ‌వ జ‌రుగుతోందా... అమ‌ల...

అఖిల్ పెళ్లి విష‌యంలో అక్కినేని ఫ్యామిలీలో ఈ గొడ‌వ జ‌రుగుతోందా… అమ‌ల పంతం ఇదేనా..!

ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున రెండో కుమారుడు అక్కినేని నవమన్మధుడు అఖిల్ పెళ్లి విషయంలో ఆ ఫ్యామిలీలో గొడవలు.. పంతాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నాగచైతన్య – సమంత పెళ్లి చేసినప్పుడే అఖిల్ కి కూడా పెళ్లి చేసేయాల‌ని నాగార్జున డిసైడ్ అయ్యారు. ఆ టైంలో అఖిల్ ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన జీవీకే మనవరాలు శ్రీయాభూపాల్‌తో ప్రేమలో పడ్డాడు.

వారిద్దరికీ చాలా వైభవంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక ఇటలీలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో.. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత నాగచైతన్య – సమంత పెళ్లి జరిగింది. నాలుగేళ్ల పాటు కాపురం చేశాక ఈ జంట కూడా విడిపోయింది. ఇక అఖిల్ కు త్వరగా పెళ్లి చేయాలని అమల కంగారుపడుతోందట. అఖిల్ హీరో అయి ఇప్పటికే 8 ఏళ్లు అవుతోంది. పెళ్లి వయసు దాటుపోతుందని అమల కంగారు అమలది.

అయితే తొలి బ్రేకప్ తర్వాత అఖిల్ పెళ్లి, ప్రేమ అంటే ఎందుకో ? ఆసక్తి చూపించడం లేదు. అయితే నాగార్జున ఆలోచన మరోలా ఉందట. ముందు నాగచైతన్యకు పెళ్లి చేసి.. ఆ తర్వాత అఖిల్ పెళ్లి విషయంలో కంగారు పడకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని భావిస్తున్నాడట. అఖిల్, చైతు తొలిప్రేమల విషయంలో నాగార్జున ఎలాంటి ? ఆలోచన చేయకుండా వారి ఇష్టానికి పూర్తిగా ఓటేశాడు. దీంతో ఇద్దరు ప్రేమలు సక్సెస్ కాలేదు.

అందుకే ఇప్పుడు ఎలాంటి ? కంగారు లేకుండా ముందుగా నాగచైతన్య పెళ్లి చేశాకే.. అఖిల్ కు పెళ్లి చేయాలని నాగార్జున ప్లాన్. అయితే అమల మాత్రం చైతు పెళ్లితో సంబంధం లేకుండా.. ముందు అఖిల్ పెళ్లిచేయాలని పట్టుబడుతుందట. ఈ విషయంలో ఫ్యామిలీలో కాస్త డిస్క‌ర్ష‌న్లు, పంతాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ప్రమోషన్లలో తన పెళ్లి గురించి అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

పెళ్లెప్పుడు ? అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ ఆన్సర్ ఇస్తూ.. అప్పుడే పెళ్లి చేసుకోమంటారా ?అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం తాను సింగిల్గానే ఉన్నానంటూ.. తన రిలేషన్షిప్ పై క్లారిటీ కూడా ఇచ్చాడు. ఏది ఏమైనా చైతు, అఖిల్ పెళ్లిళ్లు ఇప్పుడు నాగార్జునకు కాస్త సవాల్‌గా మారాయి అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news