Moviesఆ యంగ్ హీరోకు జోడీగా నిహారిక‌.. హీరోయిన్‌గా రీ ఎంట్రీ క‌న్‌ఫార్మ్‌...!

ఆ యంగ్ హీరోకు జోడీగా నిహారిక‌.. హీరోయిన్‌గా రీ ఎంట్రీ క‌న్‌ఫార్మ్‌…!

మెగా కుటుంబం నుంచి వచ్చి హీరోయిన్గా రెండు మూడు సినిమాల్లో నటించింది మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. ఒక మనసు లాంటి ఫీల్‌గుడ్‌ సినిమాలో నటించి సంచలనం క్రియేట్ చేసింది. అసలు మెగా ఫ్యామిలీ లాంటి కుటుంబం నుంచి ఒక అమ్మాయి హీరోయిన్‌గా వస్తుందని ఎవరు ఊహించరు. అలాంటిది నిహారిక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవడంతో పాటు.. ఏకంగా వెండితెరపై హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత సూర్యకాంతం – హ్యాపీ వెడ్డింగ్ సినిమాలతోనూ ప్రేక్షకులు ముందుకు వచ్చినా అవి కూడా అమ్మడికి హిట్ ఇవ్వలేదు. దీంతో పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంది. మూడేళ్ల క్రితం గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. కారణాలు ఏమిటో ? తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసాయని.. వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది.

చైతు – నిహారిక ఇప్పటికే వేరువేరుగా ఉంటున్నారు. ఎంతైనా సినిమా కుటుంబంలో పుట్టి పెరగడంతో నిహారిక ఆ రంగాన్ని వదిలిపెట్టలేక పోతుంది. ఈ గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిపోవాలన్న కోరికతో ఉన్నట్టు ఆమె అడుగులు చెబుతున్నాయి. హీరోయిన్‌గా కాకుండా నిర్మాతగా సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది.

త్వరలోనే ఇదే బ్యానర్ పై మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలను నిర్మించే ఆలోచనలో కూడా ఉంది. ఇదిలా ఉంటే నిహారిక ఇప్పుడు విడాకులు తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నిహారిక ఇప్పుడు హీరోయిన్‌గా కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సంకేతాలు ఇచ్చేసిందంటున్నారు. విడాకులు క‌న్‌ఫార్మ్ అయిన వెంట‌నే ఆమె మ‌రోసారి నాగ‌శౌర్య‌తో పాటు కొంద‌రు యంగ్ హీరోల‌కు జోడీగా సినిమాలు చేసే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. సినిమాల్లో మ‌ళ్లీ తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల‌న్న క‌సి అయితే ఆమెలో బ‌లంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news