Moviesబాల‌య్య‌కు జోడీగా దీపికా ప‌దుకొనే… నంద‌మూరి ఫ్యాన్స్‌ను ఆప‌లేంగా..!

బాల‌య్య‌కు జోడీగా దీపికా ప‌దుకొనే… నంద‌మూరి ఫ్యాన్స్‌ను ఆప‌లేంగా..!

దీపికా పదుకొనే ఇండియన్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించినా… గ్లామర్ రంగంపై ఎంతో ఆసక్తితో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. కింగ్ ఫిషర్ మోడల్ గా బాగా పాపులర్ అయిన దీపిక అనంతరం బాలీవుడ్లో మంచి అవకాశాలు అందుకుంది. తొలి సినిమాతోనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన దీపిక చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో దీపికకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.

సంజ‌య్ లీలా బ‌న్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావత్‌ సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన దీపిక తనదైన అందంతో పాటు.. చక్కటి అభినయంతో కట్టిపడేసింది. నాయకా ప్రధాన చిత్రంతో రు. 600 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయగల సత్తా తన సొంతమని దీపిక ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంది. దీపిక.. షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టారు. అంతకుముందే ఆమె కన్నడంలో ఉపేంద్ర సరసన ఓ సినిమాలో కూడా నటించారు.

అయితే 16 ఏళ్ల తన జర్నీలో ఆమె ఇప్పటివరకు టాలీవుడ్ లో అడుగుపెట్టనే లేదు. చివరకు పెళ్లయ్యాక ఇప్పుడు ఆమె ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇది పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతోంది. అయితే దీపికకు టాలీవుడ్ నుంచి ఇదే తొలి ఆహ్వానం కాదు. ఆమె గతంలోనే ఓ తెలుగు సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమా హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలోనూ ఆమెకు అవకాశాలు వచ్చినా రకరకాల కారణాలతో ఆమె టాలీవుడ్ అవకాశాలను తిరస్కరించిందని ప్రచారం జరిగింది.

బాలయ్యతో సీనియర్ దర్శకుడు జయంత్ అల్లరి పిడుగు సినిమా తెరకెక్కించారు. ఆ సినిమాలో దీపికను హీరోయిన్గా తీసుకోవాలని భావించారు. అయితే బాలయ్య లాంటి మాస్ హీరో సరసన దీపిక సరిపోదని డిసైడ్ అయిన జయంత్.. ఆమె స్థానంలో మరో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌ను హీరోయిన్గా తీసుకున్నారు.
అలా దీపిక టాలీవుడ్ ఎంట్రీ మిస్ అయింది. ఒక‌వేళా ఆ సినిమాలో దీపిక న‌టించి ఉంటే బాల‌య్య ఫ్యాన్స్‌కు లైఫ్‌కు స‌రిప‌డా ఎంజాయ్ ఉండేది.

ఆ తర్వాత మహేష్ బాబుతో తాను ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చినా అప్పుడు దీపిక బిజీగా ఉండడంతో ఆ సినిమా చేజేతులా వదులుకుంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news