Moviesఅస‌లు పుష్ప ఎక్క‌డ‌… ఏమైంది.. బ‌న్నీ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే ఇచ్చారుగా.....

అస‌లు పుష్ప ఎక్క‌డ‌… ఏమైంది.. బ‌న్నీ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే ఇచ్చారుగా.. (వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్ర‌ష్మిక రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా పుష్ప. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే అసలు ప్రమోషన్లు లేకుండానే బాలీవుడ్ లో ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా దెబ్బతో బన్నీ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై కూడా లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు.. పుష్ప 2పై భారీ హైప్ ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ వ‌చ్చినా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ర‌ష్మిక బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. తిరుప‌తి జైలు నుంచి బుల్లెట్ గాయాల‌తో త‌ప్పించుకున్న పుష్ప అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

అస‌లు పుష్ప ఎక్క‌డ ? అనే డైలాగ్‌తో ఫ్యాన్స్‌తో మ‌రింత ఉత్కంఠ క్రియేట్ చేశారు. ఈ వీడియోను ఏప్రిల్ 7 సాయంత్రం 4.05 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మ‌రి పుష్ప అడ్ర‌స్ ఎక్క‌డ ? ఏమైపోయాడు. అన్న సస్పెన్స్ అయితే మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news