MoviesTrivikram Srinivas త్రివిక్ర‌మ్‌కు.. దేవీకి ఎక్క‌డ చెడింది… గురూజీకి ఎక్క‌డ మండింది..!

Trivikram Srinivas త్రివిక్ర‌మ్‌కు.. దేవీకి ఎక్క‌డ చెడింది… గురూజీకి ఎక్క‌డ మండింది..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్ అంటేనే సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌.
ఈ కాంబినేష‌న్‌లో జ‌ల్సా – జులాయి – అత్తారింటికి దారేది – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లాంటి సూప‌ర్ హిట్ మ్యూజిక‌ల్ హిట్స్ ప‌డ్డాయి. అంత గొప్ప మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవీని కొద్ది రోజులుగా త్రివిక్ర‌మ్ త‌న సినిమాల‌కు పెట్టుకోవ‌డం లేదు. ఈ సందేహం ఇప్పుడు అంద‌రిలోనూ వ‌స్తోంది. దేవీ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ ఎంత మంచి హిట్ కాంబినేష‌న్ అయినా గురూజీ ఇప్పుడు దేవిని అస‌లు త‌న ద‌గ్గ‌ర‌కే ఎందుకు ? రానివ్వ‌డం లేద‌న్న‌దే పెద్ద డౌట్‌గా మారింది.

త్రివిక్ర‌మ్ గ‌త కొద్ది రోజులుగా త‌న సినిమాల‌కు దేవిని ప‌క్క‌న పెట్టేసి కొత్త మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌నే పెట్టుకుంటున్నాడు. అజ్ఞాత‌వాసి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ – అర‌వింద స‌మేత, అల వైకుంఠ‌పురంలో థ‌మ‌న్‌ – అ..ఆ మిక్కీ జే మేయ‌ర్ లాంటి వారిని తీసుకున్నాడు. ఇప్పుడు మ‌హేష్‌బాబుతో తీస్తోన్న కొత్త సినిమాకు కూడా థ‌మ‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంపిక‌య్యాడు.

ఇలా దేవిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేయ‌డంతో ఖ‌చ్చితంగా వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రిగింద‌నే ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇండ‌స్ట్రీలో ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా పాట‌లు, ఆర్ ఆర్ టైంలో త్రివిక్ర‌మ్‌కు, దేవిశ్రీకి మ‌ధ్య జ‌రిగిన చిన్న గొడ‌వ కాస్తా పెద్ద‌దిగా మారింద‌ట‌. అక్క‌డే ఇద్ద‌రి ఇగోలు హ‌ర్ట్ కావ‌డంతో ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌లేద‌ని టాక్ ?

ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ దేవిని త‌న సినిమాల‌కు పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి.. ఇత‌ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను పెట్టుకుంటున్నాడు. అయితే దేవి – త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తే చూడాల‌ని కోరుకునే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే ఇప్ప‌ట్లో మ‌ళ్లీ వీళ్లిద్ద‌రు క‌లిసి ప‌నిచేయ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇక గ‌త రెండేళ్లుగా దేవి త‌న రేంజ్‌కు త‌గ్గ మ్యూజిక్ కూడా ఇవ్వ‌ట్లేదు. ఈ టైంలో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ దేవిని రీపీట్ చేస్తాడ‌ని ఆశించ‌డం క‌లే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news