Moviesపవన కళ్యాణ్ ఆ తెలుగు హీరోకి అప్పు ఎగ్గొటాడా..? ఇన్నాళ్లకు...

పవన కళ్యాణ్ ఆ తెలుగు హీరోకి అప్పు ఎగ్గొటాడా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం.. వీడియో వైరల్‌..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పేరు క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ సినిమాలతో పాటు పాలిటిక్స్ లోను నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రీసెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . కాగా మరోసారి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్సనల్ మ్యాటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది .

కాగా 2017 లో రామ్ చరణ్ హీరోగా తెరంగేట్రం చేసిన చిరుత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ షోని హోస్ చేసింది ఎవరో కాదు .. మాటల మాంత్రికురాలు యాంకర్ సుమ. ఈ క్రమంలో చిరంజీవి తన కొడుకు చరణ్ వద్ద పవన్ అప్పు తీసుకున్న విషయాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. ఇదే విషయంలో యాంకర్ సుమ ఆ విషయాన్ని ఇంకా ఫన్నీగా క్రియేట్ చేస్తూ “నిజామా పవన్ కళ్యాణ్ గారు..? మీరు చరణ్ దగ్గర అప్పు తీసుకున్నారా ..?” అంటూ ప్రశ్నించగా ఏమాత్రం మొహమాట పడని పవన్ కళ్యాణ్ ..

“అవునండి.. నేను చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాను ..నేను సినిమాలో చేస్తున్న సరే నా దగ్గర డబ్బులు ఉండేటివి కాదు.. వదినని అడుగుదామంటే సినిమాలు చేస్తున్న కూడా ఇంకా నన్ను డబ్బులు అడుగుతావా అని అనుకుంటారేమో అన్న భయంతో అడిగేవాడిని కాదు .. ఇక ఎవరిని అడగాలో తెలియక అప్పుడు చరణ్ దగ్గర డబ్బులు ఉండేటివి ..ఆ విషయం తెలిసి డబ్బులు అడిగేవాడిని ..ఇప్పటికి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. ఇప్పుడు చరణ్ హీరో అయిపోయాడు.. కాబట్టి ఇక తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటూ చెప్పకు వచ్చాడు”.

ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు. ఇలా చరణ్ దగ్గర అప్పు తీసుకొని పవన్ ఇవ్వలేకపోయాడు అనే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు.ఇదే విషయంపై చరణ్ కూడా స్పందిస్తూ ..”పవన్ బాబాయ్ వడ్డీతో సహా ఇచ్చేస్తా అనేవాడు ..అందుకే అప్పట్లో నేను ఏమి ఖర్చు పెట్టుకోకుండా దాచుకునే వాడిని ..ఆ డబ్బులు బాబాయ్ కి ఇచ్చేసేవాడిని ” అంటూ తెలిసి తెలియని అమాయకంగా చెప్పుకొచ్చాడు . ప్రెసెంట్ ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news