MoviesKrithishetty కృతి శెట్టికి కి కొత్త తలనొప్పి.. ఒకటి అనుకుంటే ఇంకోకటి...

Krithishetty కృతి శెట్టికి కి కొత్త తలనొప్పి.. ఒకటి అనుకుంటే ఇంకోకటి జరిగిందే..!!

కన్నడ బ్యూటీ కృతి శెట్టి కి కొత్త తలనొప్పులు ఎదురయ్యాయా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . నిన్న మొన్నటి వరకు తెలుగులోనే ఆఫర్స్ రావడం లేదని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన బాలీవుడ్ అవకాశాలను కూడా అమ్మడు చేజార్చుకుంటుంది. మనకు తెలిసిందే..మెగా మేనల్లుడు హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

అయితే ఎవరు ఊహించిన విధంగా తర్వాత చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే కృతి శెట్టి బాలీవుడ్ లో అవకాశాల కోసం ఏకంగా తండ్రిని తీసుకొని ముంబై చెక్కేసింది. అక్కడ నాలుగు రోజుల పాటు సరదాగా గడిపిన కృతి శెట్టి దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టికి టాలీవుడ్ లో అవకాశాలు రావడంలేదని ..ఈ క్రమంలోనే బాలీవుడ్ కి అవకాశాల కోసం అడుక్కోవడానికి వెళ్ళింది అంటూ కామెంట్స్ చేశారు .

కాగా ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా కృతిశెట్టి .. కి అవకాశాలు ఇవ్వడం లేదంటూ తెలుస్తుంది. బాలీవుడ్లో ఆఫర్ల కోసం ట్రై చేసే బ్యూటీ కి తెలుగులో ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అంటూ డైరెక్టర్స్ కూడా చేస్తున్నారట . ఇదే క్రమంలో కృతి శెట్టి కి ఎందుకు ఆఫర్స్ ఆఫర్స్ ఇవ్వాలి అంటూ..వచ్చిన అరాకొరా డైరెక్టర్స్ కూడా వెనకడుగు వేస్తూ ఉండడంతో కృతి శెట్టి కెరియర్ టోటల్గా డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో మరోసారి కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news