Moviesఅమ్మ బాబోయ్: కీర్తి సురేష్ మహానటి కాదు మహా "నాటీ".. దండం...

అమ్మ బాబోయ్: కీర్తి సురేష్ మహానటి కాదు మహా “నాటీ”.. దండం పెట్టాలే తల్లి నీకు..!!

ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో .. ఎక్కడ చూసినా నాని హీరోగా నటించిన దసరా సినిమా వార్తలు వైరల్ అవుతున్నాయి . నానికి ఇది నిజంగా మంచి గూస్ బంప్స్ తెప్పించే హిట్టనే చెప్పాలి . ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎవరు కూడా ఈ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేసింది లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కొత్త డైరెక్టర్ డెబ్యూ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు.

దాని వెనక ఎంతో కష్టం .. కృషి.. పట్టుదల.. హార్డ్ వర్క్ ఉండాలి . అన్నింటిని ఎదుర్కొని.. ఫైనల్లీ సక్సెస్ అన్న పదానికి దగ్గర అయిపోయాడు శ్రీకాంత్ . ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడి పెర్ఫార్మన్స్ సూపర్ డూపర్ గా ఉంది అంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా మొత్తానికి హైలైట్ లాస్ట్ 30 మినిట్స్. కధను ఎలా తిప్పాలో తెలిసిన డైరెక్టర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ ని సినిమాలో పెట్టాలి అనుకునన్నప్పుడే సినిమా సగం హిట్ అయ్యింది అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. వెన్నెల పాత్రకి కీర్తి సురేష్ తప్పిస్తే మరి ఏ హీరోయిన్ సెట్ అవ్వదు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఎలా విజృంభించేసిందో.. అంతకు మించి నటించింది.. ఈ సినిమాలో కీర్తి. మరీ ముఖ్యంగా డైరెక్టర్ ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ను తూ చా తప్పకుండా చెప్పేసిందని.. అది వల్గర్ పదం వస్తుందా..? బ్యాడ్ మీనింగ్ వస్తుందా..? ఎక్కడ ఆలోచించుకోకుండా ఊర నాటు మాస్ డైలాగులతో థియేటర్స్ లో రచ్చ్చలేపుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొంతమంది జనాలు అడుగు ముందుకేసి సినిమాలో హీరో నాని ఎంత సక్సెస్ తీసుకొచ్చాడో హీరోయిన్ కీర్తి సురేష్ అంతే సక్సెస్ తీసుకొచ్చిందని సినిమాకి ఇద్దరు రెండు కళ్ళు లాంటివాళ్ళు అంటూ చెప్పుకొస్తున్నారు . మరి కొంతమంది మహానటి కాదు ..మహా “నాటి”.. సినిమాలో అంత నాటి పర్ఫామెన్స్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తూ దసరా సినిమా హాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news