MoviesLaya ఎంతో మంది వద్దు వద్దు అని చెప్పారు..అయినా వినలేదు..లాస్ట్ కి...

Laya ఎంతో మంది వద్దు వద్దు అని చెప్పారు..అయినా వినలేదు..లాస్ట్ కి అదే జరిగిపోయింది..నా తల రాత అంతే..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు ..అవకాశాలు లేక కొంతమంది.. సినిమా ఇండస్ట్రీకి దూరమైతే ..మరి కొంతమంది భర్త కోసం పిల్లల భవిష్యత్తు కోసం సినిమా ఇండస్ట్రీని వీడారు. అలాంటి వారిలో ఒకరే అందాల ముద్దుగుమ్మ లయ . ఈ పేరు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లయ ఫారిన్ కంట్రీస్ లో సెటిలైపోయింది . భర్త పెద్ద ఉద్యోగస్తుడు కావడంతో అక్కడే సెటిలైపోయిన లయ.. ఇప్పుడు పిల్లలతో భర్తతో హ్యాపీగా తన లైఫ్ని ముందుకు తీసుకెళుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్న లయ ..ఈ మధ్యకాలంలో ఇన్స్టాల్ లో పదేపదే రీల్స్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ తన గత తాలుక జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది . ఈ క్రమంలోనే ఆమె కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది .

ఆమె మాట్లాడుతూ ..”నా కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశాను ..అయితే ఓ సినిమా చేస్తున్న టైంలో మాత్రం అందరూ నన్ను వార్న్ చేశారు . ఆ సినిమా చేయొద్దు చెయ్యొద్దు అంటూ నన్ను బలవంతం చేశారు . అదే ప్రేమించు సినిమా . ఈ సినిమాలో నేను ఒక అంధురాలి పాత్రను పోషించాల్సి ఉంది . అప్పటివరకు గ్లామరస్ పాత్రలు చేసిన నేను ఒక్కసారిగా అలాంటి పాత్ర చేస్తే నా కెరియర్ డిజాస్టర్ అయిపోతుంది.. ఏమో అని అంతా భయపడ్డారు . పలువురు స్టార్స్ కూడా నాకు అదే విధంగా సజెస్ట్ చేశారు.

అయినా నేను వినలేదు నాకు ఎందుకో ఆ క్యారెక్టర్ నచ్చింది . చేయాలనుకున్నాను.. అందుకే రిజల్ట్ ఎలా వచ్చినా పర్లేదు అంటూ చేశాను . ఆ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకోలేదు .. నేనే కాదు ఎవరు ఊహించలేదు ..నా తలరాతను మార్చేసింది ఆ సినిమానే” అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు ఇప్పటికే ఆ సినిమా టీవీలో వస్తే పలువురు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా టీవీకి అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు . అంతలా లయ అంధురాళి పాత్రలో ఆకట్టుకునేసింది . సాయికిరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలక్ష్మి ప్రధాన పాత్రలో నటించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news