MoviesSurya-Jyothika సూర్య - జ్యోతిక దంప‌తులు నిజంగానే విడిపోయారా… ప‌క్కా క్లారిటీ...

Surya-Jyothika సూర్య – జ్యోతిక దంప‌తులు నిజంగానే విడిపోయారా… ప‌క్కా క్లారిటీ ఇదే..!

తమిళ సినిమా పరిశ్రమంలోని అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. సూర్య కేవలం కోలీవుడ్లో మాత్రమే కాదు.. ఇటు టాలీవుడ్ లోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సూర్య సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. సూర్య తర్వాత, సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగులో అన్న వేసిన పునాదిపై మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో సూర్య కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు.

నిర్మాతగా కూడా సూర్యకు మంచి గుర్తింపు ఉంది. తన 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లో ఇది 42వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత వెట్రిమార‌న్ దర్శకత్వంలో వాడివాసల్‌ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఒక విషయం మీడియాలోనూ.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి 2006లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులు ఇద్దరు గత కొద్దిరోజులుగా విడిపోతున్నారంటూ ఒక్కటే వార్తలు పుకారులు.. షికారులు చేస్తున్నాయి. సూర్య జ్యోతిక దంపతులకు దియా – దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక కొద్దిరోజులపాటు జ్యోతిక సినిమాలకు దూరంగానే ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్నారు. అసలు సూర్య – జ్యోతిక మధ్య గ్యాప్ ఎందుకు ? వచ్చింది ఈ ప్రచారం వెనుక వాస్తవం ఏంటన్న దానిపై తమిళ న‌టుడు బైల్వాన్ రంగ‌నాథ‌న్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి సూర్య జ్యోతికను పెళ్లి చేసుకోవటం సూర్య తండ్రి శివకుమార్‌కు ముందు నుంచి ఇష్టం లేదని.. కేవలం తన కుమారుడు కోసమే ఒప్పుకున్నారని ఆయన చెప్పారు. పెళ్లి తర్వాత కూడా జ్యోతిక సినిమాలలో నటించడం శివకుమార్‌కు ఇష్టం లేదని.. ఇప్పుడు జ్యోతిక సినిమాలలో నటిస్తుండడంతో శివకుమార్ తట్టుకోలేకపోతున్నారని సమాచారం. దీనివల్ల తండ్రి కొడుకులు మధ్య గత కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయని.. సూర్య ఇటు జ్యోతికకు, అటు తండ్రికి సర్ది చెప్పలేక తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావించినట్లు తెలుస్తోంది.

రీసెంట్గా సూర్య‌ తన తండ్రి తమ్ముడు కార్తీక్‌కు దూరంగా ముంబైలో ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవడంతో ఆమె సినిమాలలో కంటిన్యూ అవ్వాలన్న కోరికతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవటం వల్లే సూర్య, జ్యోతిక త‌న కుటుంబానికి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట సూర్య – కార్తీ అందరూ కలిసి చెన్నైలో ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ ముంబైలో కొత్త ఇల్లు కొని అక్కడ సెటిల్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news