Moviesబిగ్ బ్రేకింగ్: వాణీజయరాం ను హత్య చేశారు..? మొత్తం కక్కేసిన పని...

బిగ్ బ్రేకింగ్: వాణీజయరాం ను హత్య చేశారు..? మొత్తం కక్కేసిన పని మనిషి..!!

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న వాణీ జయరాం.. కొద్ది సేపటి క్రితమే మృతి చెందారు . కాగా 77 వయసు గల వాణి జయరాం వయసు మీద పడినా సరే చాలా యాక్టివ్గా తన పనులు తానే చేసుకునేవారు అంటూ బంధువులు చెప్పుకొస్తున్నారు . అయితే వాణి జయరాం మరణించడానికి ముందు జరిగిన సందర్భాలు ఇప్పుడు పోలీసులకు కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి . కాగా వాణి జయరాం తలకు బలమైన గాయం తగిలి ఉండడంతో ఇది హత్యగా పరిగణిస్తున్నారు పోలీసులు.

ఈ క్రమంలోనే రీసెంట్గా వాణీ జయరాం ఇంటికి సమీపంలోని సిసిటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు . అయితే ఇలాంటి టైంలోనే వాణిజయరాం ఇంట్లో పని చేస్తున్న పని మనిషి ఆమె మరణం పై స్పందించారు . నిన్న రాత్రి కూడా బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమె మీడియాతో మాట్లాడుతూ..” నేను దాదాపు పదేళ్ళుగా వాణి జయరాం గారి ఇంట్లో వర్క్ చేస్తున్నాను. ఆమె ఇంట్లోనే ఉంటాను. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే ఉంటుంది . ఎప్పటిలాగే నేను రోజు ఉదయం 10:45 నిమిషాలకు ఇంట్లోకి వెళ్లడానికి కాలింగ్ బెల్ కొట్టాను. ఎప్పుడూ ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అయితే ఈసారి ఏంటో డోర్ ఓపెన్ చేయలేదు. నాకు చెప్పకుండా ఎక్కడికి కూడా వెళ్లదు.. వెళ్లే ముందు కచ్చితంగా నాకు చెప్పేసే వెళ్తుంది. ఐదు..ఏడు సార్లు డోర్ కాలింగ్ బెల్ కొట్టాను . అయినా తెరవలేదు.. కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు ..సాధారణంగా మేడం ఇలా ఎప్పుడు చేయరు ..నాకెందుకో భయమేసింది ..నా భర్తకు సమాచారం అందించాను ..వెంటనే కింద ఉండే వాళ్ళకి విషయం చెప్పాను.. దీనితో అనుమానం వచ్చిన వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు”.

కాగా పద్మా అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆమెకు ఎక్కువ విషెస్ చెబుతూనే ఉన్నారు . చాలా యాక్టివ్ గా చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు . ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదు. అయితే నుదుటిపై గాయాలు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటూ బోరున ఏడ్చేసింది .దీంతో వాణి జయరాం ది కచ్చితంగా హత్య అంటున్నారు ఆమె అభిమానులు . అయితే ఆమె ఆస్తి వివరాలు గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు . మరణానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news