Moviesన‌మ్మించి మోసం చేసిన స్టార్ హీరో… బండ బూతులే తిడుతోన్న న‌య‌న‌తార‌…!

న‌మ్మించి మోసం చేసిన స్టార్ హీరో… బండ బూతులే తిడుతోన్న న‌య‌న‌తార‌…!

కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఇష్యూ పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీని గురించే ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది. స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార త‌న భ‌ర్త‌కు జ‌రిగిన అన్యాయానికి ర‌గిలిపోతోంద‌ట‌. ఆమె ఈ విష‌యంలో ఓ స్టార్ హీరోపై కారాలు మిరియాలు నూర‌డంతో పాటు తిట్టిపోస్తోంద‌ని కూడా అంటున్నారు. అస‌లు విష‌యంలోకి వెళితే న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ డైరెక్ట‌ర్‌

రీసెంట్‌గా విఘ్నేష్ న‌య‌న్‌, స‌మంత‌ల‌ను హీరోయిన్లుగా పెట్టి విజ‌య్ సేతుప‌తితో కేఆర్కే సినిమా తీయ‌డం.. ఇది తెలుగులో కూడా రిలీజ్ కావ‌డం జ‌రిగాయి. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అయితే ఆడ‌లేదు. అయితే త‌న భ‌ర్త‌ను ఎలాగైనా స్టార్ డైరెక్ట‌ర్‌గా నిల‌బెట్టాల‌ని న‌య‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అజిత్‌తో త‌న‌కు ఉన్న బాండింగ్‌ను వాడుకుని ఏకంగా అజిత్ త‌న భ‌ర్త డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేసేలా ఒప్పించింది.

గ‌త యేడాదిన్న‌ర కాలంగా విఘ్నేష్ ఈ ప్రాజెక్టుపై వ‌ర్క్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించేలా ప్లాన్ చేశారు. అజిత్ కెరీర్‌లో 62వ సినిమాగా ఇది వ‌స్తుంద‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. ఈ ప్రాజెక్టుతో విఘ్నేష్ కెరీర్ నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌న్న ఒక్క‌టే చ‌ర్చ న‌డిచింది.

అయితే విఘ్నేష్ చెప్పిన క‌థ‌లో మార్పులు చేయాల‌ని అజిత్ కోరినా విఘ్నేష్ ఒప్పుకోలేద‌ట‌. దీంతో అజిత్ నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి విఘ్నేష్‌ను త‌ప్పించేశాడంటున్నారు. వెంట‌నే అజిత్ ఈ సినిమాను మరో దర్శకుడు మగిళ్ తిరుమేనితో చేస్తానని చెప్పేశాడ‌ట‌. అయితే విఘ్నేష్ శివ‌న్ కూడా త‌న సోష‌ల్ మీడియాలో అజిత్ ప్రాజెక్ట్‌లో తాను లేన‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో వీరి కాంబినేష‌న్ లేద‌ని తేలిపోయింది.

అయితే అజిత్ ముందు ఓకే చెప్పి… అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చాక కూడా త‌న భ‌ర్త‌ను త‌ప్పించేయ‌డం న‌య‌న్‌కు తీవ్ర కోపాన్ని తెప్పించిందంటున్నారు. ఆమె అజిత్‌పై తీవ్ర ఆగ్ర‌హావేశాలు కూడా వ్య‌క్తం చేస్తోంద‌ట‌. అక్క‌డితో ఆగ‌కుండా ఆమె అజిత్‌ను నానా మాట‌లు అంటోంద‌ని కూడా ఇప్పుడు కోలీవుడ్ మీడియా, సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. అయితే అజిత్ మాత్రం శుభాస్క‌ర‌న్‌కు త‌న 63వ ప్రాజెక్టుతో విఘ్నేష్‌కు ఛాన్స్ ఇస్తాన‌ని ప‌రిస్థితి చ‌క్క‌బ‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news