Moviesపాపం..చివరి కోరిక తీరకుండానే మరణించిన తారకరత్న..కుమిలి కుమిలి ఏడుస్తున్న భార్య..!!

పాపం..చివరి కోరిక తీరకుండానే మరణించిన తారకరత్న..కుమిలి కుమిలి ఏడుస్తున్న భార్య..!!

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది . నందమూరి కుటుంబంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషాదవార్త వినాల్సి వచ్చింది. నందమూరి తారకరామారావు గారి మనవడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో కన్నుమూశారు . గత 23 రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తారకరత్న కి డాక్టర్లు ఎలాంటి వైద్యం ఇచ్చిన .. ఆ దేవుడు కనికరం చెప్పలేదు. కోమాలోకికి వెళ్లిపోయిన తారకరత్న చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి మరణించారు. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బెంగళూరులోని నారాయణ హృదయాలయ డాక్టర్లు .

కాగా ఈ విషాద వార్తను విన్న తర్వాత నందమూరి అభిమానుల గుండె ఆగినంత పని అయింది . మరి ముఖ్యంగా బాలకృష్ణ ని ఆపడం ఎవరి తరం కావట్లేదు. చిన్నపిల్లలు గుక్క పట్టి తారకరత్న పార్ధివ దేహం వద్ద విలపిస్తున్నారు. ” నీ భర్త ప్రణానికి నా ప్రాణం అడ్డు..ఏమీ కాదు” అంటూ తారకరత్న భార్యకు నచ్చజెప్పిన ఆయననే కంట్రోల్ చేయలేని పొజిషన్ కి వచ్చేసింది . ఈ క్రమంలోనే తారకరత్న పార్ధివ దేహాన్ని హైదరాబాద్ కి తరలించారు డాక్టర్లు .

కాగా ఇలాంటి క్రమంలోనే తారకరత్న లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే తారకరత్న హీరోగా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. తన లక్ ని పరీక్షించుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ఆయన స్టార్ హీరోగా మారలేకపోయాడు . ఈ క్రమంలోనే తాతగారు లాగే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు . కాగా ఎవరు ఊహించిన విధంగా దేవుడు ఇంత చిన్న ఏజ్ లోనే ఆయనను తిరిగిరాని లోకానికి తీసుకెళ్ళిపోయాడు . ప్రజాసేవ చేయాలనే తన చివరి కోరిక తీరనేలేదు ..ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తారకరత్న లేడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news