MoviesSamantha మొగుడిని వదిలేసిన ఆడదాని అలాగే చూస్తారా రా..? పాపం సమంతకి...

Samantha మొగుడిని వదిలేసిన ఆడదాని అలాగే చూస్తారా రా..? పాపం సమంతకి ఎంత కష్టం వచ్చిందో..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన పేరుకి పబ్లిసిటీ చేసుకునే అవసరం లేకుండా ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది సమంత . ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన సమంత .. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తుంది . హీరో లేకపోయినా సరే సమంత ఉంటే ఆ సినిమా హిట్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు అంటే ఆమె ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు .

కాగా రీసెంట్గా సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం. శకుంతలా దేవి పాత్రలో సమంత జీవించేసింది. దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హా తెరంగేట్రం చేస్తుండటం మరో విశేషం . కాగా మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ప్రతి షాట్ ను ఎంతో క్లియర్గా .. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా .. ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి అన్ని సన్నహాలు చేసుకున్నారు. కానీ పఠాన్ సినిమా తెచ్చిన తలనొప్పులతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. పఠాన్ సినిమా భారి హిట్ కావడంతో పలు సినిమాలు వాయిదా వేసుకుంటూ.. సమంత లాక్ చేసుకున్న ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు . ఈ క్రమంలోనే సమంత తో పోటీ వద్దు తలనొప్పులు వద్దు అంటూ తన సినిమాను ఏకంగా ఏప్రిల్ 14కు పోస్ట్ పోన్ చేసుకుంది .

దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కొద్దిసేపటి క్రితమే సమంత అధికారికంగా ప్రకటించింది. దీంతో సమంత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అదే నీకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఈ విధంగా నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండేది కాదు.. లైఫ్ లో తప్పు చేసావ్ సామ్ అంటూ మళ్ళీ చైతన్య తో డివోర్స్ ని గుర్తు చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news