Moviesఆ టాలీవుడ్ యంగ్ హీరో కోసం న‌మ్ర‌త స్కెచ్ మామూలుగా లేదుగా..!

ఆ టాలీవుడ్ యంగ్ హీరో కోసం న‌మ్ర‌త స్కెచ్ మామూలుగా లేదుగా..!


సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ద‌గ్గ‌ర క‌న‌ప‌డ‌ని బిజినెస్ టెక్నిక్‌లు చాలానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే న‌మ్ర‌త మ‌హేష్ సినిమా లైఫ్‌లోకి ఎంట‌ర్ అయ్యాక మ‌హేష్ కెరీర్‌లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. మ‌నోడి క్రేజ్ సినిమాల ప‌రంగాను, ఇటు సోష‌ల్ మీడియాలో భారీగా పెరిగింది. మ‌హేష్ లుక్‌, డ్రెస్సింగ్ స్టైల్లోనూ ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఇక శ్రీమంతుడు సినిమా టైం నుంచి మ‌హేష్ సినిమాల బిజినెస్‌, వ‌సూళ్లు, లెక్క‌లు, రెమ్యున‌రేష‌న్లు, డైరెక్ట‌ర్ల‌ను డిసైడ్ చేయ‌డం లాంటి విష‌యాల్లోనూ ఆమె ప్ర‌మేయం ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న గుస‌గుస‌లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి

ఇక న‌మ్ర‌త మ‌హేష్ సినిమాల విష‌యంలోకి ఎంట‌ర్ అయ్యాక మ‌హేష్ ప్ర‌తి సినిమాలోనూ వాళ్లు షేర్ కూడా తీసుకుంటున్నారు. రెమ్యున‌రేష‌న్ + షేర్ ప‌ద్ధ‌తిలోనే ఎక్కువుగా మ‌హేష్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే మ‌హేష్ మేజ‌ర్ లాంటి సినిమాల‌కు నిర్మాత‌గా మారి కూడా నిర్మిస్తున్నాడు. ఇదంతా న‌మ్ర‌త ప‌క్కా ప్లానింగ్‌తోనే జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ హీరో కోసం న‌మ్ర‌త నిర్మాత‌గా మారుతోంది.

ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు మ‌హేష్‌, న‌మ్ర‌త‌ల మేన‌ళ్లుడు గ‌ల్లా అశోక్‌. న‌మ్ర‌త పెద్ద ఆడ‌ప‌డుచు గ‌ల్లా ప‌ద్మావ‌తి, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు అశోక్ హీరోగా తెర‌కెక్కిన హీరో సినిమా గ‌త సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. ఇక చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు అశోక్ రెండో సినిమా ప్రారంభ‌మైంది. అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

తొలి సినిమాకు భిన్నంగా మైథలాజికల్ టచ్‌తో గల్లా అశోక్ రెండో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి అశోక్ అత్త న‌మ్ర‌త రావ‌డంతో పాటు కెమేరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల‌కు కార్తీకేయ గుమ్మంకొండ‌తో చేసిన గుణ 369 త‌ర్వాత ఇది రెండో సినిమా. ఈ సినిమా త‌ర్వాత అశోక్ మూడో సినిమాను తానే నిర్మాత‌గా మారి ఓ పెద్ద ద‌ర్శ‌కుడితో ప్లాన్ చేస్తోంద‌ట న‌మ్ర‌త‌. త‌మ జీఎంబీ బ్యానర్లోనే అశోక్ మూడో సినిమా ఉంటుంద‌ని కూడా న‌మ్ర‌త సిగ్నల్స్ ఇస్తోంద‌ట‌.

అశోక్‌ను క‌మ‌ర్షియ‌ల్ హీరోగా నిల‌బెట్టే క్ర‌మంలోనే మ‌హేష్‌, న‌మ్ర‌త క‌లిసి మరీ ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాలో న‌మ్ర‌త పూర్తి ఇన్వాల్‌మెంట్ ఉంటుంద‌ట‌. ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రు ? ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news