Moviesశ్రీలీల పేరు చెప్పితే దండం పెట్టేస్తున్న స్టార్ హీరోలు .. అంత...

శ్రీలీల పేరు చెప్పితే దండం పెట్టేస్తున్న స్టార్ హీరోలు .. అంత పెద్దది అయిపోయిందా..?

అప్పటిదాకా బెల్లంగా ఉన్న హీరోయిన్ లు అప్పటికప్పుడే అల్లంగా మారిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతే.. మాయాలోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరో చెప్పలేరు . లేకపోతే నిన్న మొన్నటి వరకు శ్రీలీల పేరు చెప్తే అందాల ముద్దుగుమ్మ.. అదృష్ట దేవత అంటూ పొగిడేసిన మేకర్సే . ఇప్పుడు వామ్మో ఆ పిల్ల వద్దురా బాబోయ్ అంటూ చేతులెత్తి దండం పెట్టేస్తున్నారు .

దానికి కారణం పెళ్లి సందడి సినిమాకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీలీల.. ధమాకా సినిమాకు ఆ సంఖ్య ను రెండు చేసింది . కాగా ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడంతో శ్రీ లీల.. ఆ సంఖ్యని ఏకంగా నాలుగుగా మార్చేస్తుందట . టాలీవుడ్ సీనియర్ హీరోయిన్సేఇప్పటి వరకు ఇంత రెమ్యూనరేషన్ అందుకోవట్లేదు.

ఇండస్ట్రీకి వచ్చి పది హిట్లు కొట్టినా కానీ ఇంక ముద్దుగుమ్మలు రెండు మూడు దగ్గర ఆగిపోయారు. ఒక్కే ఒక్క హిట్ కొట్టేసరికి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని స్టార్ హీరోలకి చెప్పగా వాళ్ళు షాక్ అయిపోతున్నారట. అంతేకాదు శ్రీలీల హీరోయిన్గా వద్దు రా బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారట. దీంతో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news