Moviesit's Official: ఆ హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుందోచ్..అన్నదమ్ములు ఏం స్కెచ్...

it’s Official: ఆ హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుందోచ్..అన్నదమ్ములు ఏం స్కెచ్ వేసారు రా బాబు..!!

అబ్బబ్బా.. కళ్యాణ్రామ్ ఎంతటి మంచి గుడ్ న్యూస్ అందించాడు . ఇన్నాళ్లు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ ని ఎట్టకేలకు అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశాడు. మనకు తెలిసిందే నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా బింబిసారా.. ఈ సినిమా పార్ట్ వన్ రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేసింది .

కళ్యాణ్రామ్ కెరియర్ లోనే ఎక్కువ బజ్ క్రియేట్ చేసుకున్న .. మూవీ గా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా.. రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు సీక్వెల్ రాబోతుందా అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేశారు. కాగా ఎట్టకేలకు ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు కళ్యాణ్ రామ్ . ఆయన నటించిన తాజా చిత్రం అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని రివీల్ చేసాడు.

కెరియర్ లోని ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ తో పెద్ద సాహసం చేస్తున్న కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్రామ్ బింబిసారా 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు . వచ్చే ఏడాది చివరిలో బింబిసారా 2 స్టార్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దీనితో నందమూరి అభిమానులకు కొత్త జోష్ నింపినట్లయింది. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడు అంటూ క్రేజీ టాక్ వైరల్ అవుతుంది .ఒకవేళ అదే కనుక నిజమైతే నందమూరి హీరోస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news