MoviesHyper Aadi వామ్మో..ఏంటిది..అందరి ముందే హైపర్ ఆది ని అంత మాట...

Hyper Aadi వామ్మో..ఏంటిది..అందరి ముందే హైపర్ ఆది ని అంత మాట అనేసిన ధనుష్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ప్రజెంట్ తెలుగులో చేస్తున్న సినిమా సార్ . వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ , ఫస్ట్ లుక్ జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి . మరి ముఖ్యంగా నేటి కాలంలో విద్యావ్యవస్థలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటూ సాగే అంశంలో ఈ కథను మలిచాడు వెంకి అట్లూరి.

కాగా రీసెంట్గా హైదరాబాదులోని ఏఎంబి మాల్ లో సార్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ధనుష్ మాట్లాడుతూ స్టేజిపై ఉన్న హైపర్ ఆదిని ఓ రేంజ్ లో పొగిడేసారు. స్టేజి పైకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నప్పుడు.. హైపర్ ఆది పేరు చెప్పగానే అక్కడ ఉండే జనాలు అరుపులు కేకలతో స్టేడియం ని దద్దర పుట్టించాడు .

ఈ క్రమంలోనే నాకంటే హైపర్ ఆదికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న రేంజ్ లో కామెంట్స్ చేశారు. ఓ కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో హైపర్ ఆది లాంటి చిన్న కమెడియన్ ని ఈ రేంజ్ లో పొగడేయడం జనాలకు షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కాగా జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రజెంట్ జనసేన మీటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.. పలు సినిమాల్లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news