Moviesనంద‌మూరి బాల‌య్య పెళ్లిళ్ల పేర‌య్యా.. సెంటిమెంట్ సూప‌ర‌య్యా…!

నంద‌మూరి బాల‌య్య పెళ్లిళ్ల పేర‌య్యా.. సెంటిమెంట్ సూప‌ర‌య్యా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో నేష‌న‌ల్ రేంజ్‌లో ఎలా ? దూసుకుపోతోందో చూస్తూనే ఉన్నాం. ఎందుకో ఏమో తెలియ‌దు గాని టాలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌కు బాల‌య్య‌కు ఏదో విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. బాల‌య్య టాక్ షోకు వెళ్లిన వారంద‌రికి పెళ్లి కుదిరిపోతోంది. బాల‌య్య మాటో, ఆశీర్వాద‌మో తెలియ‌దు కాని ఇది ఇప్పుడు పెద్ద సెన్షేష‌న‌ల్‌గా మారింది.

అన్‌స్టాప‌బుల్ షోల‌కు వ‌చ్చిన యంగ్ హీరోల‌కు బాల‌య్య మాట బాగా క‌లిసొస్తోంది. బాల‌య్య శ్రీఘ్ర‌మేవ క‌ళ్యాణ ప్రాప్తిర‌స్తు అని దీవించిన వెంట‌నే వాళ్ల‌కు పెళ్లి జ‌ర‌గ‌డ‌మో లేదా పెళ్లి ప్ర‌య‌త్నాలు మొద‌లు కావ‌డ‌మో జ‌రుగుతోంది. ఈ టాక్ షోకు వ‌చ్చిన యంగ్ హీరో అడ‌వి శేష్‌ను బాల‌య్య పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. బాల‌య్య అలా శేష్ పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చాడో లేదో వెంట‌నే అడ‌వి శేష్ ఇంట్లో త‌న చెల్లి పెల్లి నిశ్చ‌యం జ‌రిగ‌గింది. ఈ పెళ్లి కూడా అయిపోయింది.

ఇప్పుడు శేష్ వ‌య‌స్సు కూడా ముదిరిపోతూ ఉండ‌డంతో ఇంట్లో వాళ్లు మ‌నోడికి కూడా పిల్ల‌ను వెతికే ప‌నిలో చాలా స్పీడ్‌గా ఉన్నార‌ట‌. టాలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌డు అయిన శేష్ పెళ్లి గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి టాక్ లేదు. కానీ ఇప్పుడు మ‌నోడి పెళ్లి గురించి ఇంట్లో స్పీడ్‌గా ఉండ‌డం బాల‌య్య దీవెనే కార‌ణ‌మంటున్నారు.

ఇక ఇదే షోకు వెళ్లిన మ‌రో బ్యాచిల‌ర్‌, యంగ్ హీరో శ‌ర్వానంద్ పెళ్లి రక్షిత రెడ్డితో జ‌ర‌గ‌నుంది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. బాల‌య్య దీవెన వ‌ల్లే శ‌ర్వానంద్ పెళ్లి జ‌రిగింద‌ని స‌ర‌దాగా డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. ఇక వీరితో పాటు డార్లింగ్ ప్ర‌భాస్ వంతు కూడా వ‌చ్చింది. బాల‌య్య టాక్ షోలో ప్ర‌భాస్‌ను పెళ్లెప్పుడు అని అడ‌గ‌డంతో పాటు శ‌ర్వానంద్‌ను అడిగితే ప్ర‌భాస్ త‌ర్వాత అని చెప్పాడ‌ని అంటే.. నేను స‌ల్మాన్‌ఖాన్ త‌ర్వాత అనాలేమో అని ప్ర‌భాస్ స‌ర‌దాగా చెప్పాడు.

ఇక ఇప్పుడు ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌య‌త్నాలు కూడా మొద‌ల‌య్యాయ్ అంటున్నారు. ప్ర‌భాస్ రీసెంట్‌గా త‌న రాణిని క‌లిశార‌ని.. ఆ పెళ్లి కూడా త్వ‌ర‌లో జ‌రిగితే.. బాల‌య్య దీవెన వ‌ల్లే అని టాక్ ఎలాగూ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇక ప‌వ‌న్‌తో అన్‌స్టాప‌బుల్ షోకు వ‌చ్చిన సాయితేజ్‌ను సైతం పెళ్లెప్పుడని బాల‌య్య అడిగేశాడు. ప‌క్క‌నే ఉన్న మావ‌య్య ప‌వ‌న్ అవుతుంద‌ని హింట్ ఇవ్వ‌డంతో బాల‌య్య సాయితేజ్‌ను క‌ళ్యాణ ప్రాప్తిర‌స్తు అని దీవించేశాడు.

సాయితేజ్‌కు యాక్సిడెంట్ త‌ర్వాత నుంచి కూడా సంబంధాలు చూస్తున్నారు. వీటిల్లో ఏదో ఒక మ్యాచ్ సెట్ అయితే అంత‌కు మించిన ఆనందం ఏం ఉంటుంది. ఏదేమైనా బాల‌య్య టాక్ షోకు, టాలీవుడ్ బ్యాచిల‌ర్ హీరోల పెళ్లికి ఏదో క‌నెక్ష‌న్ అయితే కుదిరింది. అందుకే బాల‌య్య‌ను పెళ్లిళ్ల పేర‌య్య అని పిలుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news