Newsచిరంజీవి, ఎన్టీఆర్ హిట్ సినిమాల‌కు ' అమిగోస్‌ ' కు ఆ...

చిరంజీవి, ఎన్టీఆర్ హిట్ సినిమాల‌కు ‘ అమిగోస్‌ ‘ కు ఆ లింక్ ఉందా…!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ చాలా రోజుల త‌ర్వాత గ‌తేడాది వ‌చ్చిన బింబిసార సినిమాతో కెరీర్‌లోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. బింబిసార సినిమా క‌ళ్యాణ్‌రామ్ మార్కెట్ రేంజ్ బాగా పెంచేసింది. సోషియో ఫాంట‌సీ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా సీతారామం సినిమా రోజునే రిలీజ్ అయ్యి మ‌రీ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ప్ర‌స్తుతం క‌ళ్యాణ్‌రామ్ రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా అమిగోస్‌. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం త్రిబుల్ రోల్లో న‌టిస్తున్నాడు.

ఈ సినిమాపై నంద‌మూరి అభిమానుల్లోనే కాదు.. స‌గ‌టు తెలుగు సినిమా అభిమానిలోనూ విప‌రీత‌మైన ఆస‌క్తి నెల‌కొంది. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించ‌గా… జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అస‌లే వ‌రుస విజ‌యాల‌తో మంచి జోరుమీదున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు దీనిని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా జ‌రిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ మాట్లాడారు. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని.. తాత‌య్య రామారావు గారు రాముడు భీముడు, బాబాయ్ బాల‌య్య సింహాతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డ్యూయెల్ రోల్లో న‌టించార‌ని.. ఇక చిరంజీవి గారు ముగ్గురు మొన‌గాళ్లు, త‌మ్ముడు తార‌క్ జై ల‌వ‌కుశ సినిమాల్లోనూ మూడు పాత్ర‌ల్లో న‌టించార‌ని తెలిపారు.

ఇక ఇప్పుడు తాను కెరీర్‌లో ఫ‌స్ట్ టైం డ్యూయెల్ రోల్లో న‌టించాన‌ని.. ఖ‌చ్చితంగా ఈ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని.. ఎవ్వ‌రిని డిజ‌ప్పాయింట్ చేయ‌ద‌ని క‌ళ్యాణ్ చెప్పాడు. ఏదేమైనా క‌ళ్యాణ్‌రామ్ మాట‌ల్లో అయితే అమిగోస్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంద‌ని తెలుస్తోంది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు యూ / ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది. ఫిబ్ర‌వ‌రి 10న అమిగోస్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news