MoviesSamantha బ్రేకింగ్: హీరోయిన్ సమంత రెండో పెళ్లి..క్లారిటీ వచ్చేసిందోచ్..!!

Samantha బ్రేకింగ్: హీరోయిన్ సమంత రెండో పెళ్లి..క్లారిటీ వచ్చేసిందోచ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రకాల వార్తలు వినిపిస్తున్నాయో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంతా రెండో పెళ్లికి సంబంధించిన న్యూస్లు పదేపదే ట్రెండ్ అవుతున్నాయి . ఆమె రెండో పెళ్లి చేసుకోవట్లేదు రా బాబు అంటూ ఓపెన్ గా చెప్పిన సరే .. సమంత స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని త్వరలోనే ఆ స్టార్ హీరోతో ఎంగేజ్మెంట్ కి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే గత వారం రోజులుగా బాలీవుడ్ బడా హీరోతో సమంత రహస్య మీటింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా రీసెంట్గా వాటికి చెక్ పెడుతూ సమంత తన రెండో పెళ్లి చేసుకోవట్లేదు అంటూ చెప్పకనే చెప్పేసింది . మనకు తెలిసిందే సమంతకి మొదటి నుంచి భక్తి ఎక్కువ .. ఎక్కువగా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది . దీనికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . కాగా రీసెంట్గా సమంత తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పలని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది . ఈ ఆలయాన్ని దర్శించాలంటే సుమారు 600 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే సమంత 600 మెట్లు ఎక్కడమే కాదు మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయింది .

ఈ క్రమంలోనే సమంతను దగ్గరుండి చూసుకున్నాడు స్టార్ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్. కాగా దీనికి సంబంధించిన పిక్స్ , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వైట్ అండ్ వైట్ ప్లాజో కుర్తిలో చాలా క్లాస్ చాలా ట్రెడిషనల్ గా కనిపించింది సమంత . అంతేకాదు సమంత – నాగచైతన్య కి విడాకులు ఇచ్చే ముందు కూడా ఇలానే అన్ని దేవాలయాలను చుట్టి తిరిగేసింది. ఇలా సమంత మళ్ళీ గుడిలో కనిపించడం చూస్తుంటే సమంతా తన నెక్స్ట్ నిర్ణయాన్ని తీసేసుకుందని..ఈ క్రమంలోనే దేవుడికి చెప్పడానికి ఇలా వెళ్తుందని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అందుకుతున్న సమాచారం ప్రకారం సమ్మత ఇప్పట్లో రెండో పెళ్ళి చేసుకోదు అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news