Movies"నాలాంటి ఈ పొజీషన్ నీకు రాకుడదు"..సమంత ఎమోషనల్ కామెంట్స్..!!

“నాలాంటి ఈ పొజీషన్ నీకు రాకుడదు”..సమంత ఎమోషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయూసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఆమె ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత బాధపడుతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది . అప్పటి నుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకుంటున్న సమంత .. దక్షిణ కొరియాలో ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందని అక్కడికి వెళ్లి నెలలు తరబడి ట్రీట్మెంట్ అందుకుని .. రీసెంట్గా నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియాకు తిరిగివచ్చింది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా సమంత చాలా డల్ గా కనిపించింది . ఈ క్రమంలోని ఆమె బ్యూటీపై కొందరు నెగిటివ్గా స్పందిస్తూ.. నెగటివ్గా కామెంట్ చేస్తున్నారు . “మీ ఫేస్ లో ఒకప్పటి గ్లో లేదని ..ఆ చార్మ్ మిస్ అయ్యిందని..విడాకుల తరువాత స్ట్రాంగ్ ఉమెన్ గా ప్రూవ్ చేసుకున్న నికు..మయాసైటిస్ అనే వ్యాధితో భారీ దెబ్బ పడిందని”.. కావాలనే కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేశారు.

ఈ క్రమంలోనే సమంత కూడా చాలా సున్నితంగా కౌంటర్ ఇచ్చింది . “నేను తీసుకున్న ఇన్ని మెడిసిన్స్ ..ఇన్నాళ్లు నేను తీసుకున్న ట్రీట్మెంట్ నీ వరకు రాకూడదు .. ఇలాంటి పొజిషన్ నీకు రాకూడదని కోరుకుంటున్నాను.. అందుకోసం నేను ప్రత్యేకంగా నీకు నా ప్రేమను పంపిస్తున్నాను ” అంటూ ఎమోషనల్ గా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది . దీంతో సమంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కాగా నాగచైతన్యత్ఫ్ విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత పేరు సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. గతంలో సోషల్ మీడియాలో సమంత ఈవిధంగా ట్రోల్ అయ్యిందే లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news