Moviesముందు రు. 50 ల‌క్ష‌ల‌కు ఓకే చెప్పి రు. 2 కోట్లు...

ముందు రు. 50 ల‌క్ష‌ల‌కు ఓకే చెప్పి రు. 2 కోట్లు అడిగిన డైరెక్ట‌ర్‌…నాగ్‌కు మైండ్ బ్లాక్ అయ్యిందా…!

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో కెరీర్‌లో బాగా ప‌డిపోయాడు. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఏ ముహూర్తాన ఆఫీస‌ర్ సినిమా ఒప్పుకున్నాడో ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డం కాదు నాగ్ పరువు మొత్తం తీసేసింది. అప్ప‌టికే మ‌న్మ‌థుడు 2 సినిమాతో నాగ్ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక ఆఫీస‌ర్ సినిమాతో నాగ్ పాతాళానికి ప‌డిపోయాడు.

ఇక నాలుగు ప్లాపుల త‌ర్వాత గ‌తేడాది సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ప్లాపులే ప‌ల‌క‌రిస్తున్నాయి. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌కత్వంలో చేసిన ది ఘోస్ట్ చిరంజీవి గాడ్ ఫాథ‌ర్ సినిమాతో పోటీప‌డి మ‌రీ ప్లాప్ అయ్యింది. అంటే నాగ్ చివ‌రిగా న‌టించిన 8-10 సినిమాల్లో బంగార్రాజు త‌ప్పా చెప్పుకోవ‌డానికేం లేదు.

ఈ నేప‌థ్యంలోనే త‌న కెరీర్‌లో వ‌స్తోన్న 100వ సినిమాను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సూప‌ర్ హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడు. ఇందుకోసం చాలా స్టోరీలు విని ఫైన‌ల్‌గా రైట‌ర్ బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ చెప్పిన క‌థ‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు కూడా వ‌చ్చింది. అయితే ఈ డీల్ ఓకే అయిన‌ప్పుడు నాగ్ క‌థ‌, డైరెక్ష‌న్‌కు క‌లిపి రు. 50 ల‌క్ష‌లు ఇస్తాన‌న్నాడ‌ట‌.

అయితే ఇప్పుడు అదే ప్ర‌స‌న్న‌కుమార్ స్టోరీ ఇచ్చిన ధ‌మాకా సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా రు. 100 కోట్లు దాటేసి రు. 110 కోట్ల వైపు ప‌రుగులు పెడుతోంది. దీంతో బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్‌కు భారీ డిమాండ్ వ‌చ్చేసింది. దీంతో మ‌నోడు కొండెక్కేశాడ‌ట‌. ముందు నాగ్‌తో క‌థ ఇచ్చి సినిమా డైరెక్ష‌న్ చేసేందుకు రు. 50 ల‌క్ష‌ల‌కు ఓకే చెప్పిన ప్ర‌స‌న్న ఇప్పుడు రు. 2 కోట్ల‌కు త‌క్కువ అయితే కుద‌ర‌దు అని చెప్పేశాడ‌ట‌.

ప్ర‌స‌న్న చెప్పిన కొత్త రేటు విని నాగ్‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయినంత ప‌నైంద‌ట‌. దీంతో ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌తో ముందుకు వెళ్లాలా ? వ‌ద్దా ? అని డైల‌మాలో ప‌డిన‌ట్టు టాక్ ? ఏదేమైనా ప్ర‌స‌న్న డిమాండ్ చేసిన రేటు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news