Moviesవావ్: మళ్లీ యాంకర్ గా అనసూయ.. ఈసారి మరింత సరికొత్తగా..!?

వావ్: మళ్లీ యాంకర్ గా అనసూయ.. ఈసారి మరింత సరికొత్తగా..!?

అనసూయ మరోసారి యాంకర్ గా మారిపోతుందా అంటే అవుననే అంటున్నారు బుల్లితెర ప్రముఖులు . న్యూస్ రీడర్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తరువాత తనదైన స్టైల్ లో యాంకర్ గా కొనసాగుతూ ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక రోల్స్ నటిస్తూ జనాలు చేత శభాష్ అనిపించుకుంటుంది . ఇప్పటికే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే.

పుష్ప సినిమాలో కూడా సునీల్ భార్య గా డీ గ్లామర్ లుక్ లో కనిపించింది . ఈ క్రమంలోనే అనసూయ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి . అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఆమె చేస్తున్న జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది . అనసూయ ఎందుకు అలా చేసిందా ..? అంటూ అందరూ బుర్రుపిక్కున్నారు .

ఈ క్రమంలోనే బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేక అలాంటి షో నుంచి తప్పుకున్నారు అని చెప్పుకొచ్చిన అనసూయ మాటలను జనాలు ట్రోల్ చేశారు . రీసెంట్ గా మళ్లీ అనసూయ తో జీ తెలుగులో ప్రసారమయ్యే షో తో యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్ట బోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి దీని పై అనసూయ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news