Moviesరాంగోపాల్ వ‌ర్మ ల‌వ‌ర్ ఎవ‌రు... ఆమె గుర్తుగా చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా...

రాంగోపాల్ వ‌ర్మ ల‌వ‌ర్ ఎవ‌రు… ఆమె గుర్తుగా చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచ‌ల‌నానికి కేరాఫ్‌. త‌న గురించి, త‌న వ్యాఖ్య‌ల గురించి ఎవ‌రు ఏం అనుకున్నా కూడా వ‌ర్మ తాను ఏం చేయ‌ల‌ద‌లిస్తే అదే చేస్తాడు.. ఏం మాట్లాడాలి అనుకుంటే అదే మాట్లాడేస్తాడు. వ‌ర్మ స్టైల్ అంతే. అస‌లు త‌న పోస్టులు, కాంట్ర‌వ‌ర్సీ డైలాగుల‌పై ఎదుటి వారు ఏమని ఫీల్ అవుతారో ? అన్న‌ది వ‌ర్మ ఏ మాత్రం ప‌ట్టించుకోడు.

వ‌ర్మ ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌తి రోజు సినీ ల‌వ‌ర్స్‌కు, త‌న అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటూనే ఉన్నాడు. తాజాగా వ‌ర్మ త‌న ఇంట‌ర్వ్యూలో రెండు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. వ‌ర్మ మామూలుగానే త‌న అతిలోక సుంద‌రి శ్రీదేవిని పిచ్చ‌పిచ్చ‌గా ప్రేమించాన‌ని.. తాను అంత‌గా ప్రేమించిన శ్రీదేవిని బోనీక‌పూర్ చేసేసుకున్నాడ‌ని.. అత‌నో విల‌న్ అని ఏదేదో వాగుతూ ఉంటాడు.

ఇక శ్రీదేవి త‌ర్వాత ఊర్మిళ‌తోనూ వ‌ర్మ ఎఫైర్ న‌డిపించాడ‌న్న టాక్ ఉంది. ఇదిలా ఉంటే వ‌ర్మ అంత‌కుముందే స‌త్య అనే అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు. అయితే ఆమెతో వ‌ర్మ ల‌వ్ స‌క్సెస్ కాలేదు. అయితే ఆమె ప్రేమ జ్ఞాప‌కాలు మాత్రం వ‌ర్మ త‌న మ‌దిలో అలాగే ప‌దిల‌ప‌రుచుకున్నాడు. అందుకే ఆమె ప్రేమ గుర్తుగానే స‌త్య అనే సినిమాకు ఆమె పెట్టుకున్నాడ‌ట‌.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే వ‌ర్మ నాగార్జు, ఊర్మిళ జంట‌గా అంతం సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే ఆ స్టోరీ మీద అభిమానంతోనే మ‌ళ్లీ అదే క‌థ‌ను తిప్పి స‌త్య సినిమా తీశాడ‌ట‌. అది బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు వ‌ర్మ‌కు బాలీవుడ్‌లో మంచి పేరు రావ‌డానికి కార‌ణమైంది. అంతం బాగా ఆడి ఉంటే తాను స‌త్య తీసేవాడినే కాద‌ని కూడా వ‌ర్మ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news