Moviesబాల‌య్య‌తో త‌ప్పా ఎవ్వ‌రితోనూ సినిమా చేయ‌ను.. స్టార్ డైరెక్ట‌ర్ పంతం...!

బాల‌య్య‌తో త‌ప్పా ఎవ్వ‌రితోనూ సినిమా చేయ‌ను.. స్టార్ డైరెక్ట‌ర్ పంతం…!

టాలీవుడ్‌లో బాల‌య్య‌తో సినిమాలు చేసే డైరెక్ట‌ర్ల‌కు చాలా కంపర్ట్ ఉంటుంది. బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో. అస‌లు ఆయ‌న ఓ సారి క‌థ విని ఓకే చెప్పాక అస్స‌లు క‌థ‌, డైలాగులు, డైరెక్ష‌న్‌లో జోక్యం చేసుకోరు. ఈ విష‌యంలో టాలీవుడ్‌లో ఎంత గొప్ప హీరో కూడా బాల‌య్య‌కు సాటిరారు. ఇక డైరెక్ష‌న్‌లోనూ ఆయ‌న క‌లుగ‌చేసుకోరు. డైరెక్ట‌ర్ ఏది చెపితే అది చేయ‌డ‌మే బాల‌య్య‌కు వ‌చ్చు.

ఎంత గొప్ప స్టార్ డైరెక్ట‌ర్ అయినా కూడా కెరీర్ మొత్తం మీద బాల‌య్య‌తో ఒక్క సినిమా అయినా చేయాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కూడా బాల‌య్య‌తో పైసా వ‌సూల్ సినిమా చేశాడు. సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా జ‌స్ట్ బ్రేక్ ఈవెన్ మాత్ర‌మే అయ్యింది. అయితే ఇన్నేళ్ల బాల‌య్య కెరీర్‌లో ఆయ‌న్ను ఈ సినిమాలో పూరి చూపించిన‌ట్టుగా ఎవ్వ‌రూ చూపించ‌లేదు.

అలాంటి పూరి ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఫామ్‌లోకి వ‌చ్చి లైగ‌ర్‌తో పెద్ద డిజాస్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. లైగ‌ర్ చూశాక అస‌లు పూరిని స్టార్ హీరో కాదు క‌దా.. మీడియం రేంజ్ హీరో కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ట్లేదు. ఎవ‌రో ఎందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ పూరితో స్టార్ట్ చేసిన జ‌న‌గ‌ణ‌మ‌న సైతం మ‌ధ్య‌లో వ‌దిలేశాడు. అస‌లు పూరిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్తితి లేదు.

ఇప్ప‌టికిప్పుడు పూరి ఓ హీరోను ప‌ట్టుకుని హిట్ కొట్టి తానేంటో ఫ్రూవ్ చేసుకుని.. మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాలి. కొద్ది రోజుల క్రితం పూరిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మెగాస్టార్‌తో సినిమా అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అస‌లే మెగా, చిరు కాంపౌండ్ ప్లాపుల డైరెక్ట‌ర్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌దు. అందులోనూ పూరికి, చిరుకు మ‌ధ్య ఎంతైనా గ్యాప్ న‌డుస్తోంది.

దీంతో ఇప్పుడు పూరి బాల‌య్య‌తోనే తాను ముందుగా సినిమా చేసి ఫ్రూవ్ చేసుకుంటాన‌ని పంతంతో ఉన్నాడ‌ట‌. ఇప్ప‌టికే క‌థ మెయిన్ లైన్ రెడీ అయ్యింద‌ట‌. ఇదో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ స్టోరీ అని… తండ్రి, కొడుకుల మ‌ధ్య సాగే క‌థ‌… అది కూడా ర‌వితేజ ఇడియ‌ట్ స్టైల్లో ఉంటుంద‌ని అంటున్నారు. సినిమా ఎమోష‌న‌ల్‌గా ఉన్నా.. కామెడీ కూడా ఉంటుంద‌ని… బాల‌య్య డ్యూయోల్ రోల్ చేస్తాడ‌ని అంటున్నారు. ఏదేమైనా పూరి పంతానికి బాల‌య్య ఓకే చెపుతాడా ? లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news