Moviesనైజాంలో వీర‌సింహా డే 1 రికార్డ్ ఫిక్స్‌... జై బాల‌య్య స్లోగ‌న్‌తో...

నైజాంలో వీర‌సింహా డే 1 రికార్డ్ ఫిక్స్‌… జై బాల‌య్య స్లోగ‌న్‌తో మార్మోగుతోన్న థియేట‌ర్లు..!

న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. సినిమాకు అటు అమెరికా నుంచి తెలంగాణ‌, ఆంధ్రా వ‌ర‌కు మామూలు జ‌బ్ లేదు. థియేట‌ర్లు అన్నీ కూడా జై బాల‌య్య స్లోగ‌న్‌తో మార్మోగుతున్నాయి. ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు అన్నీ హౌస్ ఫుల్స్ ప‌డిపోయాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కువైట్ ఎక్క‌డ చూసినా జై బాల‌య్య మానియా న‌డుస్తోంది.

ఇక నైజాంతో పాటు ఆంధ్రాలోనూ ఉద‌యం 4 గంట‌ల నుంచే బెనిఫిట్ షోలు ప‌డిపోయాయి. ఇక హైద‌రాబాద్‌లో ఉద‌యం 4 గంట‌ల‌కు భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున థియేట‌ర్ల‌లో షోలు ప‌డ్డాయి. బాల‌య్య ఈ షోకు స్వ‌యంగా వ‌చ్చారు. ఫోర‌మ్ మాల్లో ఉద‌యం 4 గంట‌ల‌కే ఏకంగా 9 షోలు ప‌డ్డాయి. ఆంధ్రాలో అయితే సినిమా వాళ్లు, బాల‌య్య అభిమానులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా బాల‌య్య బెనిఫిట్ షోలు మొత్తం బుక్ చేసేసుకున్నారు.

ఇక వార‌సుడు 11 నుంచి 14కు వెళ్లిపోవ‌డంతో వీర‌సింహా విధ్వంసానికి అడ్డే లేదు. అస‌లు నైజాంలో ఫ‌స్ట్ డే బుకింగ్స్‌తో పాటు ఇక్క‌డ హ‌డావిడి చూస్తుంటే బాల‌య్య సినిమాల వ‌ర‌కు డే వ‌న్ రికార్డు చాలా సింపుల్‌గా న‌మోదు అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో, ట్విట్ట‌ర్‌లో అయితే పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ డే రు. 30 కోట్ల క‌లెక్షన్లు వ‌స్తాయంటున్నారు. ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు ప‌డ‌కుండానే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ అంటే రు. 3 కోట్ల‌కు పైనే వ‌సూల్లు వ‌చ్చేశాయి.

ఇక ఫ‌స్ట్ డే కంప్లీట్ అవ్వడం.. ఇటు ఏపీ, తెలంగాణ‌లో అన్నీ స్క్రీన్లు ఈ సినిమాకే ఇవ్వ‌డంతో ఖచ్చితంగా ఫ‌స్ట్ డే భారీ వ‌సూళ్లు రానున్నాయి. దీనికి తోడు గ‌త కొన్నేళ్ల‌లో బాల‌య్య ఏ సినిమాకు రానంత బ‌జ్ ఈ సినిమాకు వ‌చ్చింది. దీంతో ఆన్‌లైన్ బుకింగ్స్‌లో ఏ థియేట‌ర్లో ఏ షో చూసినా టిక్కెట్లు ఫుల్ అయిపోయి ఉన్నాయి. మ‌రి బాల‌య్య డే వ‌న్ రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news