Moviesహీరోల‌తో క‌మిటవ్వొచ్చు... స్టార్ హీరోయిన్ల ఐటెం సాంగ్స్ వెన‌క ఇంత న‌డుస్తోందా...!

హీరోల‌తో క‌మిటవ్వొచ్చు… స్టార్ హీరోయిన్ల ఐటెం సాంగ్స్ వెన‌క ఇంత న‌డుస్తోందా…!

ఐటెం సాంగ్ చేస్తే అదో ఉబలాటం..హీరోలతో కమిటవచ్చు..అందుకే..చాలామంది స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయి. స్టార్ హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, సమంత, అనుష్క శెట్టి, శృతి హాసన్ లాంటి ఫాంలో ఉన్న హీరోయిన్ అందరూ ఐటెం సాంగ్స్ చేస్తున్నవారే.

అప్పట్లో సౌందర్య కూడా మంచి రెమ్యునరేషన్ ఇస్తామంటే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. అయితే, అప్పట్లో సౌందర్య చేసిన స్పెషల్ సాంగ్ ఎంత హాట్ టాపిక్ అయినా మంచి పేరు తెచ్చింది. దీనికి కారణం సౌందర్య వేసుకున్న కాస్ట్యూమ్స్‌ ఎంతో పద్దతిగా ఉంటమే. కానీ, ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ చేస్తున్న ఐటెం సాంగ్స్ మరీ మాసీగా ఉంటున్నాయి.

పూజా హెగ్డే చేసిన రంగస్థలం మూవీలోని ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ అందరికీ నషా ఎక్కినట్టు ఎక్కింది. ఊరుల్లో రికార్డింగ్ డాన్స్ ఎలా చేస్తారో అలా జానీ మాస్టర్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశాడు. ఇదే కాదు, జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన ఐటెం సాంగ్ అలాగే, పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్..ఇవన్నీ పక్కా మాస్ ఆడియన్స్ కోసమే రూపొందించారు.

ఇక ఇలా ఐటెం సాంగ్ ఒప్పుకోవడం వల్ల హీరోతో, దర్శకనిర్మాతలతో బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ట్యూన్ అయితే, శృతి హాసన్ మాదిరిగా ఐటెం సాంగ్ నుంచి హీరోయిన్‌గా నటించే అవకాశం కూడా అందుకోవచ్చు. మహేష్ నటించిన ఆగడు సినిమాలో ఐటెం సాంగ్ చేసిన శృతి ఆ తర్వాత అదే మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇలాంటి అవకాశాల కోసమే మన స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడానికి ఒప్పుకునేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news