Moviesహీరో సుహాస్ అంత దుర్మారుగుడా..? వెక్కి వెక్కి ఏడ్చిన భార్య..!!

హీరో సుహాస్ అంత దుర్మారుగుడా..? వెక్కి వెక్కి ఏడ్చిన భార్య..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా రోజుకు ఓ హీరో పుట్టుకొస్తూనే ఉంటాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలని జనాలు పెద్దగా పట్టించుకోరు . అలా పట్టించుకున్నాడు అంటే మాత్రం ఆ హీరో స్టార్ హీరో కన్నా సూపర్ హీరో అనే చెప్పాలి . ఆ లిస్టులోకే వస్తాడు సుహాస్ ..కమెడియన్గా తన కెరీయర్ ను ప్రారంభించిన సుహాస్ ఆ తర్వాత పలు రోల్స్ మెప్పించి ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోగా మెయిన్ లీడ్ పాత్రలు పోషిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు .

ఆయన నటించిన కలర్ ఫోటో సినిమా ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో మనందరికీ తెలిసిందే. కాగా తర్వాత పలు సినిమాల్లో లీడ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. రీసెంట్గా ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు . ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు .

తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు . ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా చూసి తన భార్య తనను మూడు రోజులు దూరంగా పెట్టిందని.. నన్ను చూస్తే భయపడిపోయి ఏడ్చేసేదని చెప్పుకొచ్చాడు. మనకు తెలిసిందే ఫ్యామిలీ డ్రామా సినిమాలో సుహాస్ సైకో పాత్ర నటించాడు. ఆయన పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా సరే అతడు నిజంగా సైకో నా అని అనుమాన పడక తప్పదు . ఈ సినిమా విడుదలయ్యాక సుహాస్ పాత్రకి ఎంతో మంచి ఆదరణ లభించింది . ఎంతలా అంటే తన సొంత భార్య కూడా అతన్ని చూసి నువ్వు సైకో నా అని అడిగేంతలా. .!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news