Moviesఇంట్రెస్టింగ్: అదే చిరంజీవి కీ బాలయ్య కీ ఉన్న తేడా .....

ఇంట్రెస్టింగ్: అదే చిరంజీవి కీ బాలయ్య కీ ఉన్న తేడా .. తెలుసుకోండి రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో మనకు తెలిసిందే. స్టార్ హీరో సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వారిని ఇబ్బంది పెడుతుంది. రీసెంట్గా నందమూరి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలాంటి హంగామా నడిచిందో అందరికీ తెలిసిన విషయమే. మొదటగా ఒక దగ్గర అనుకున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం పరిమిషన్ ఇవ్వకపోవడంతో మరోవైపుగా మళ్ళించారు.. దానికి కారణాలన్నీ మనకు తెలిసినవే.. రోజు వార్తల్లో వింటున్నవే .

అయితే ఏమాత్రం తగ్గని వీరసింహారెడ్డి టీం 24 గంటల వ్యవధిలోని ఒంగోలులో పర్మిషన్ సంపాదించి గ్రాండ్గా ఈవెంట్ ను జరిపింది. కాగా స్టేజిపై వచ్చిన బాలయ్య మాట్లాడుతూ..” నిర్మాతలకు సినిమాలంటే ఫ్యాషన్ అని ..ఆ ఫ్యాషన్ తోనే ఇంతవరకు వచ్చారని చెప్పుకోవచ్చారు. అంతే కాదు శ్రేయస్ మీడియాని ఓ రేంజ్ లో పొగిడేశారు. లాస్ట్ మూమెంట్లో ప్లేస్ మార్చిన సరే ఏమాత్రం అభిమానులకు ఇబ్బంది కలగకుండా అద్భుతమైన స్టేజిని 24 గంటల వ్యవధిలోనే తయారు చేసినందుకు శ్రేయ శ్రీనివాస్ టీం కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు “.

అంతేకాదు బాలకృష్ణ తనని ఇబ్బంది పెట్తిన వాళ్లకి ఎలా కౌంటర్లు ఇస్తారో మనకు తెలుసు. తన సినిమా ట్రైలర్ లోను ఏపీ ప్రభుత్వానికి ఘాటుగా కౌంటర్ వేశారు . “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు ..మార్చలేరు “అనే డైలాగ్ తో ట్రైలర్ లో ఎండ్ చేశారు . ఈ డైలాగ్ విన్న ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది బాలయ్య ఎవరిని టార్గెట్ చేశారు అనేది . అయితే చిరంజీవి ని సైతం ఏపీ ప్రభుత్వం అలానే ఇబ్బంది పెట్టింది. కానీ చిరంజీవి మాత్రం ఎటువంటి విధంగా పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయ లేదు.. కౌంటర్ వెయ్యను లేదు . ఈ క్రమంలోనే బాలయ్య అనుకుంటే ఏదైనా ,,ఎలాంటి వాళ్లకైనా సరే ఇచ్చిపడేస్తాడని ..చిరంజీవి అలా చేయడానికి ఇష్టపడడని భయం కారణంగా కావచ్చు గౌరవం కారణంగా కావచ్చు సైలెంట్ గా తన పని తాను చూసుకుంటాడని ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news