Moviesఇద్దరు ప్రియురాళ్ల ముద్దుల లవర్ గా శుభ‌మ‌న్ గిల్.. ఇద్ద‌రితో...

ఇద్దరు ప్రియురాళ్ల ముద్దుల లవర్ గా శుభ‌మ‌న్ గిల్.. ఇద్ద‌రితో ఒకేసారి లవ్ ఆట..!!

భార‌త స్టార్ క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్ ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలోనూ, ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. హైద‌రాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జ‌రిగిన తొలి వన్డేల్లో డబుల్ సెంచరీ బాది అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అస‌లు గిల్ బాదిన తీరుకు ప్ర‌పంచ క్రికెట్ అభిమానులు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఓపెన్‌గా బ‌రిలోకి దిగిన గిల్ డ‌బుల్ సెంచ‌రీ చేసి 49 ఓవ‌ర్లో ఈ అరుదైన మైలురాయి సాధించాడు.

దీంతో గిల్ ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయాడు. అయితే ఇప్పుడు గిల్‌కు, భార‌త మాజీ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్‌కు లింక్ పెట్టి వార్త‌లు రాస్తున్నారు. వ‌ర‌ల్డ్ క్రికెట్లో డ‌బుల్ సెంచ‌రీలు చేసిన మామా అల్లుళ్లుగా గిల్‌, స‌చిన్ అని కామెంట్లు కురుస్తున్నాయి. మ‌రి స‌చిన్‌ను, గిల్‌ను మామా, అళ్లుల్లు అని పిల‌వ‌డం వెన‌క ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ కూడా ఉంది. రెండేళ్లుగా స‌చిన్ కూతురు సారాతో గిల్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ విష‌యం స‌చిన్ దృష్టికి వెళ్ల‌డం, స‌చిన్ కూడా త‌న కూతురు సారాకు వార్నింగ్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని అంటున్నారు. విచిత్రం ఏంటంటే అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మెరుపులు మెరిపించి వెలుగులోకి వ‌చ్చిన కొంత కాలానికే గిల్ సారాతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగాడు. అయితే అదే టైంలో గిల్ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా ఆలీఖాన్‌తో కూడా ప్రేమ‌లో ప‌డిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

సారాతో క‌లిసి విమానంలో ప్ర‌యాణిస్తోన్న ఫొటోలు, దుబాయ్‌లో ఓ రెస్టారెంట్లో భోజ‌నం చేస్తోన్న ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఒకేసారి అటు సారాతో, ఇటు సారా ఆలీఖాన్‌తో గిల్ క‌లిసి తిర‌గ‌డంతో ఇద్ద‌రు ప్రియురాళ్ల ముద్దుల ల‌వ‌ర్‌గా మారిపోయాడు. అయితే హీరోయిన్ సారాతో తిర‌గ‌డం మొద‌లు పెట్టాక గిల్‌కు, స‌చిన్ కూతురు సారాకు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చి విడిపోయార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. ఏదేమైనా ఇప్పుడు గిల్ క్రేజ్ మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news