Movies"చెప్పు తెగిపోయేలా కొడతా".. యాంకర్ రష్మీ పై నెటిజన్ ఫైర్..!!

“చెప్పు తెగిపోయేలా కొడతా”.. యాంకర్ రష్మీ పై నెటిజన్ ఫైర్..!!

జబర్దస్త్ యాంకర్ రష్మీ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో సినిమాలు చేసిన.. ఆ తరువాత అమ్మడుకు అవకాశాలు తగ్గాయి . ఇదే క్రమంలో తనలోని టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టింది రష్మి. అంతేకాదు ఎంతో ఇష్టపడి హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రష్మీ ఆ కోరికలు చంపుకోలేక యాంకరింగ్ చేస్తూనే పలు సినిమా అవకాశాలతో ఇండస్ట్రీలో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవులను హింసిస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. రీసెంట్గా కోడిపందాలలో గెలిచాను అంటూ ఓ నెటిజన్ పిక్స్ షేర్ చేశాడు . ఇదే క్రమంలో రష్మీ అతగాడిని ఏకిపారేసింది . “మూగజీవాలను హింసిచ్చి మీ పైశాచిక ఆనందం ఏంటా ..?”అంటూ ఘాటుగా స్పందించింది . ఈ క్రమంలోనే మరో నెటిజన్స్ “ఇదే విషయం నీకు దమ్ముంటే జల్లికట్టుపై మాట్లాడు.. తమిళనాడు వాళ్లు వచ్చి చెప్పుతో కొడతారు. ఆ ధైర్యం కూడా నీకు లేదు”.

“నిన్ను ఇంత పెద్ద స్టార్ ను చేసిన తెలుగు ఇండస్ట్రీపై పడి ఎందుకు ఏడుస్తున్నావు ” అంటూ వల్గర్ గా కామెంట్స్ చేశాడు. దీనితో రెచ్చిపోయిన రష్మీ మళ్ళీ అతగాడికి ఘాటు కౌంటర్ ఇచ్చింది. ” మీ ప్రతాపం నోరులేని మూగజీవాలపైన .. కోడి కాళ్ళకు కత్తి కట్టి కారం పెట్టి రెచ్చగొట్టడం మీ సంప్రదాయమా..? ఎవరు చేయమన్నారు అలా ..? సమాజంలో జరుగుతున్న తప్పు పనులపై ప్రశ్నించండి ..?” అంటూ కౌంటర్ వేసింది. దీంతో సోషల్ మీడియాలో రష్మీ పేరు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news