Moviesహీరో అవ్వాలంటే నటన రాకపోయినా పర్వాలేదు.. అది ఉంటే చాలు.. హీట్...

హీరో అవ్వాలంటే నటన రాకపోయినా పర్వాలేదు.. అది ఉంటే చాలు.. హీట్ పెంచేసిన నాని కామెంట్స్..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అంటే ఎంతో టాలెంట్ ఉండాలి.. అదృష్టం ఉండాలి.. నటన ఉండాలి .. హ్యాండ్సమ్ గా ఉండాలి.. బ్యాగ్రౌండ్ ఉండాలి. అయితే వీటన్నిటిలో నటన , హ్యాండ్సం నెస్ , టాలెంట్ లేకపోయినా ఒక్క బ్యాగ్రౌండ్ ఉంటే చాలు ఇండస్ట్రీ లోకి హీరోగా వచ్చేయచ్చు అంటూ ఎంతోమంది హీరోలు ప్రూవ్ చేశారు . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . అయితే స్టార్ హీరోలు మాత్రం చాలా తక్కువ .

టాలెంట్ ఉండి నటన పరంగా నటించే జనాలను మెప్పించిన హీరోలు ఫింగర్ కౌంటింగ్ అని చెప్పొచ్చు .అందరు తాత పేర్లు , నాన్న పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి.. ఆ ఇంటి వారసత్వాని కొనసాగిస్తున్న వారే తప్పిస్తే ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మారిన హీరోలు చాలా తక్కువ . అయితే గతంలో ఇలాంటి నెపోటిజంపై పరోక్షకంగా కామెంట్ చేసి టాలీవుడ్ స్టార్ హీరో నాని ట్రోలింగ్ కి గురయ్యారు . అప్పటి నుండే పలువురు నానిని టార్గెట్ చేస్తూ ఇప్పటికి ఆయన సినిమాలను నెగిటివ్ టాక్ క్రియేట్ చేసి మరీ రేటింగ్స్ తక్కువ ఇస్తున్నారు .

మనకు తెలిసిందే ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చాడు నాని . మొదటి అసిస్టెంట్ డైరెక్ట్ గా చేసిన నాని ..ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోగా స్టార్ హీరోగా మారాడు . అయితే కావాలనే కొందరు స్టార్ హీరో కొడుకులు ఆయన కెరియర్ను తొక్కేయడానికి ప్రయత్నించారని .. పరోక్షంగా నాని చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేశాయి . ఇప్పటికి కూడా పలువురు హీరోస్ కి నాని సినిమా అంటే గిట్టదు . ఆయన సినిమా రిలీజ్ చేసే టైం లోనే స్టార్ హీరోస్ కూడా ఆ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుని ఆయనను ఇబ్బంది పెడుతూ తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటారు . ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీలో సామాన్యులకు చోటు లేదు అంటూ చెప్పకనే చెప్పేసాడు నాని..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news