Moviesరవితేజ ఆ డ్రెస్ వేస్తే సినిమా హిట్.. మాస్ మహారాజ్ సెంటిమెంట్...

రవితేజ ఆ డ్రెస్ వేస్తే సినిమా హిట్.. మాస్ మహారాజ్ సెంటిమెంట్ మామూలుగా లేదుగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ ఎలాంటి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడో అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఒక హిడ్ కొట్టడానికి నానాదంటాలు పడిన ఈ మాస్ హీరో.. రీసెంట్గా రెండు బ్లాక్ బస్టర్ హిట్ను బ్యాక్ టు బ్యాక్ అందుకున్నాడు . మొదటగా త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ధమాకా సినిమాతో హ్యూజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ..ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు .

దీనికి ఎవరు ఊహించిన విధంగా రవితేజ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. కాగా సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ అయింది . ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి పెద్ద విజయం అందుకుందో అందరికి తెలిసిన విషయమే .ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి రవితేజ – చిరంజీవి కి బ్లాక్ బస్టర్ హిట్ అందజేసింది.

దీంతో ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజ ఏ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తే ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పటివరకు ఆయన నటించిన పోలీస్ పాత్రల్లో కనిపించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఒక్క ఖతర్నాక్ సినిమా తప్పిస్తే మిగతా సినిమాలన్నీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా మాస్ మహారాజా తన సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిన రవితేజ జోరు మామూలుగా లేదు . త్వరలోనే రవితేజ తన నెక్స్ట్ సినిమా తోను మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news