Moviesప‌విత్రా లోకేష్ ఎలాంటిదో.... న‌రేష్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంటుందో గుట్టంతా విప్పిన...

ప‌విత్రా లోకేష్ ఎలాంటిదో…. న‌రేష్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంటుందో గుట్టంతా విప్పిన ర‌మ్య‌.. షాకింగ్ నిజాలు..!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ త‌న మూడో భార్య ర‌మ్య రఘుప‌తితో కొంత కాలంగా దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. న‌రేష్ ఇప్ప‌టికే త‌న మూడో భార్య ర‌మ్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుల్లో కేసు వేశాడు. అయితే ర‌మ్య మాత్రం న‌రేష్ త‌న‌కు ఎప్ప‌ట‌కీ భ‌ర్తే అని.. ఆయ‌న‌కు విడాకులు ఇచ్చే ప్ర‌శ‌క్తే లేద‌ని.. త‌న కొడుకు సెక్యూరిటీయే త‌న‌కు ఇంపార్టెంట్ అని.. తాను కోర్టులోనే తేల్చుకుంటాన‌ని తేగెసి చెపుతున్నారు. మ‌రోవైపు న‌రేష్ ర‌మ్య‌తో విడాకులు వ‌చ్చేస్తే ప్ర‌స్తుతం తాను క‌లిసి ఉంటోన్న సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఇక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ ఇద్ద‌రూ క‌లిసి లిప్‌కిస్ ఇచ్చుకుంటోన్న వీడియో రిలీజ్ చేసి తాము ఈ ఇయ‌ర్‌లో పెళ్లి చేసుకుంటున్న‌ట్టు హింట్ ఇచ్చారు. దీనిపై ర‌మ్య ఓ వీడియోలో స్పందించారు. న‌రేష్ విడాకులు కావాల‌ని పిటిష‌న్ వేశారు. అదే త‌న‌కు ఆధార‌మైంద‌ని.. తాను చాలా ఎలిగేష‌న్లు పెట్టాన‌ని చెప్పారు. తాను చేసిన ఎలిగేష‌న్స్‌పై ఆధారాలు ఉన్నాయ‌ని.. త‌న‌పై న‌రేష్ చేసిన ఎలిగేష‌న్ల‌పై ఆరు నెల‌లు అయినా ఫ్రూవ్ చేయ‌లేద‌ని ర‌మ్య తెలిపారు.

తాను త‌న కుమారుడికి మెయింటినెన్స్ కావాల‌ని మాత్ర‌మే కేసు వేశాన‌ని.. ఆస్తి కోస‌మే తాను ఇదంతా చేస్తున్నాన‌ని అంటున్నా… నాకు నా పిల్లాడి జీవితం మాత్ర‌మే ముఖ్యం అని ర‌మ్య కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఫైన‌ల్గా నాకు విడాకులు వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని కూడా చెప్పేశారు. ఇక న‌రేష్‌, ప‌విత్ర వీడియో గురించి మాట్లాడుతూ ఓ భార్య‌గా న‌రేష్ త‌నను టీజ్ చేస్తున్నార‌ని.. తాను త‌ప్పు చేయ‌న‌ప్పుడు నింద‌లు వేస్తే స‌హించ‌న‌న్నారు.

ఇక ప‌విత్ర గురించి ర‌మ్య బాంబు పేల్చింది. ఆమె న‌రేష్‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి కేవ‌లం ఆర్థిక‌ప‌ర‌మైన కార‌ణాలే అని చెప్పింది. న‌రేష్ ఏ అమ్మాయితో అయినా ఉన్న‌ప్పుడు తాను ప‌ట్టుకుంటే రెండు నెల‌లు మాత్ర‌మే బాగా ఉంటాడ‌ని.. త‌ర్వాత మ‌ళ్లీ మామూలే అని చెప్పింది. ఇంట్లో ఎవ్వ‌రూ అడిగేవారు లేక‌పోవ‌డంతో న‌రేష్ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేసే వాడ‌ని కూడా ర‌మ్య ఆవేద‌న‌తో చెప్పింది.

గ‌తంలోనే న‌రేష్‌కు చాలా ఎఫైర్లు ఉండేవి.. మా అత్త‌గారు నాకు స‌ర్దిచెప్పేవారు… ఆయ‌న ఎలాంటి వ్య‌క్తో మా ఫ్యామిలీకి చెప్ప‌కుండానే తాను పెళ్లి చేసుకున్నాన‌ని.. ఇది పూర్తిగా త‌న స‌మ‌స్య అని.. అందుకే తాను ప‌రిష్క‌రించుకుంటాన‌ని ర‌మ్య చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news