Moviesఅందరి ముందే అల్లు అరవింద్ పరువు తీసేసిన పవన్ కల్యాణ్.. ముఖం...

అందరి ముందే అల్లు అరవింద్ పరువు తీసేసిన పవన్ కల్యాణ్.. ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో..?

అదేదో సినిమాలో చెప్పినట్టు మన కళ్ళతో చూసేదంతా నిజం కాదు ..చెవులతో వినేదంతా అబద్ధం కాదు ..అలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి ఫోటో నిజం కాదు.. కొన్ని మార్ఫింగ్ ఉండొచ్చు ..కొన్ని రకరకాల వీడియోస్ ని క్రాప్ చేసి కటింగ్ చేసి ట్రెండ్ చేస్తూ ఉండొచ్చు ..రీజన్ ఏదైనా కానీ ఏది నిజమో తెలియకుండా ఒక మనిషిని నిందించడం సమంజసం కాదు. ప్రెసెంట్ సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అల్లు అరవింద్ పిక్ ఒకటి తెగ ట్రెండ్ అవుతుంది.

Pawan Kalyan & Sujeeth OG Movie Pooja Ceremony on January 30th

మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలలోను వేగంగా దూసుకుపోతున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను వేగవంతం చేయడంతో పాటు కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నాడు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ – సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటీ అయ్యాడు . నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా గ్రాండ్గా జరిగాయి . దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ లాంచింగ్ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాతలైన అల్లు అరవింద్ , సురేష్ బాబు , దిల్ రాజు ఇంకా పలువురు పెద్ద వ్యక్తులు హాజరయ్యారు .

Pawan Kalyan-Sujeeth Movie Opening - Photo 12 of 12

కాగా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ముఖ్యంగా ఇక్కడ మనం పైన చూస్తున్న ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ఎవరైనా సరే టక్కున పవన్ కళ్యాణ్ ని నిందించడానికి సిద్ధంగా ఉంటారు . అల్లు అరవింద్ షేక్ హ్యాండ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ చేతులు ఇవ్వకపోవడమే తప్పు అంటూ ఈ ఫోటో అర్థం . అయితే నిజానికి మనం ఇక్కడ చూస్తున్న ఫోటో నిజం కాదు . అల్లు అరవింద్ ఏదో ఎక్స్ప్లైన్ చేస్తూ పవన్ కళ్యాణ్ దగ్గర చేయి చూపించాడు అంతే..

Pawan Kalyan Disrespected Allu Aravind

కానీ కొందరు పనిలేని ఆకతాయిలు ఈ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ..ఆ పవన్ కళ్యాణ్ కి హెడ్ వెయిట్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఆ పని లేని బ్యాచ్ అర్థం చేసుకోవాల్సింది ఈ ఫోటోలో ఉన్నదంతా అబద్ధం అని ..అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటో కు సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. పవన్ పేరుని మరింత దిగజార్చడానికి కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ ఈ విధంగా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news