Moviesవావ్: మరో జాక్ పాట్ కొట్టిన శ్రీలీల.. ఏం లక్ రా...

వావ్: మరో జాక్ పాట్ కొట్టిన శ్రీలీల.. ఏం లక్ రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన ధమాకా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది శ్రీలీల . ఈ సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . పెళ్లి సందడి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతో యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

Pelli SandaD' actress Sreeleela approached for a Mahesh Babu's new Film? |  Telugu Movie News - Times of India

అయినా మంచి మంచి క్రేజీ ఆఫర్స్ పట్టేసిన శ్రీలీల..ఇప్పటికే ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తుంది . అంతేకాకుండా మహేష్ బాబు సినిమాలోనుని సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది . అంతేనా బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ని సినిమాలో కీలకపాత్రలో శ్రీ లీల నటిస్తుంది. కాగా ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లు పట్టేసిన శ్రీలీల మరో జాక్ పాట్ ఆఫర్ ని కొట్టేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

Reel Buzz: Sree Leela is Balakrishna daughter

మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ తో పాటు సినిమాల్లోను బిజీగా ఉంటున్నాడు . ఈ క్రమంలోనే కమిట్ అయినా సినిమాలను త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కాగా ఇలాంటి క్రమంలోనే సాహో డైరెక్టర్ సూజిత్ తో క్రేజీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది .

పవన్‌ కు జోడీగా ధమాకా ముద్దుగుమ్మ.. అమ్మడికి భలే కలిసి వచ్చిందిగా | Heroine  Sreeleela to Act Opposite Pawan kalyan,Pawan kalyan,Heroine Sreeleela,Sujeeth,Hari  Hara Veera Mallu,Pelli Sandadi,Dhamaka ...

ఈ కథ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది . ఇదే క్రమంలో శ్రీలీల హోమ్లీ బ్యూటీగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పక్కన పర్ఫెక్ట్ ఫిగర్ అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే అదృష్టాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుంది శ్రీ లీల అన్నది మాత్రం వాస్తవం . అందుకే ఇంటికి బిగ్గెస్ట్ ఆఫర్లు వచ్చి తలుపు తడుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news