Moviesఅక్కినేని ఫ్యామిలీకి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? కోట్లు ఇచ్చి...

అక్కినేని ఫ్యామిలీకి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? కోట్లు ఇచ్చి మరి బుక్ చేసుకున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా జాతకాలు నమ్ముతారు . శుభం ఆశకునం అంటూ ఫాలో అవుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు అక్కినేని నాగార్జున . పైకి ఇలాంటివి పెద్దగా నమ్మను అని చెప్పుకుంటున్న నాగార్జున ..సెంటిమెంట్స్ విషయంలో మాత్రం చాలా కేరింగ్ గా ఉంటాడట . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నాగార్జునకు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది . ఈ క్రమంలోనే ఇంట్లో పూజలు హోమాలు కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సినిమాల పరంగా అక్కినేని ఫ్యామిలీకి ఓ హీరోయిన్ భలే కలిసి వచ్చింది. అందుకే ఆ హీరోయిన్ కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేసి మరి తండ్రి కొడుకులు అదే హీరోయిన్ కావాలి అంటూ బుక్ చేసుకున్నారట . అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే . పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి. ఎలాంటి హీరో పక్కనైనా సరే ఇట్టే సెట్ అయిపోతుంది. అందుకే నాగచైతన్యతో నటించినా “ఒక లైలా కోసం” బుక్ చేసుకున్నాడు . ఆ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్స్ ను ట్రై చేసిన సరే నాగచైతన్య పూజ హెగ్డే నే కావాలి అంటూ పట్టు పట్టి డిమాండ్ చేసి మరి ఆమెను బుక్ చేయించుకున్నాడు.

ఈ సినిమాలో పూజ హెగ్డే నటన చాలా వెరైటీగా అనిపించింది . అంతేనా ఈ సినిమా తర్వాత నాగార్జున పూజ హెగ్డే కు మరో అవకాశం ఇచ్చాడు . మన్మధుడు2 సినిమాలో మొదటి హీరోయిన్గా అనుకునేది పూజా హెగ్డే నే . కానీ పూజ హెగ్డే బిజీగా ఉన్న కారణంగా సినిమా నుంచి తప్పుకుంది , ఇక తర్వాత ముచ్చటగా మూడోసారి కొడుకు అఖిల్ కూడా పూజాతో రొమాన్స్ చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకొని ఇద్దరు కొడుకులు తో నటించే ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే .

ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్గా మారిపోయింది పూజ హెగ్డే. అంతేనా నాగచైతన్య తర్వాత నటించబోయే పరశురాం డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఇదే రిపీట్ అయితే అక్కినేని అబ్బాయి ఖాతాలో మరో హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news