MoviesUnstoppable 2: ప్రభాస్ ఫోన్ లో సేవ్ అయిన రాణీ ఎవరు..?...

Unstoppable 2: ప్రభాస్ ఫోన్ లో సేవ్ అయిన రాణీ ఎవరు..? ఫ్యాన్స్ కి కూడా తెలియని మ్యాటర్ ని బయటపెట్టిన బాలయ్య..!!

కోట్లాదిమంది ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఆశగా ఎదురుచూస్తున్న ఆన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ ప్రమో కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . ఇప్పటికే గ్లింప్స్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన ఆహా కొద్ది నిమిషాల ముందే అదిరిపోయే ప్రోమో రిలీజ్ చేసింది. ప్రోమో ఆధారంగా ప్రభాస్ చాలా బాగా ఈ షో ని ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది . మరి ముఖ్యంగా బాలయ్య తనదైన స్టైల్ లో గోపీచంద్ నీ ప్రభాస్ ని ఆటపట్టించిన తీరు జనాలకి బాగా నచ్చేసింది . అంతేకాదు బాహుబలి డైలాగ్స్ తో స్టేజ్ పైకి వెల్కం చేసిన బాలయ్య రాగానే తన కోరిక తీర్చేసుకున్నాడు .

ఒకసారి డార్లింగ్ అని పిలువు అంటూ ముద్దుగా అడగడంతో ..ముద్దుగా డార్లింగ్ సార్ అంటూ పిలిచేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే ఆడియన్స్ అరుపులు కేకలతో స్టేజి దద్దరిల్లిపోయింది . అంతేకాదు ఆ తర్వాత టాస్క్ లో భాగంగా ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ కు కాల్ చేశారు . ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య సంభాషణలలో తన గర్ల్ ఫ్రెండ్ ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోని ప్రభాస్ “నువ్వు ఫ్రెండ్ వా..? శత్రువు వా..? “అంటూ డైరెక్ట్ గానే అడిగేసాడు.

దీంతో బాలయ్య సైతం షాక్ అయిపోయాడు . ఇక ప్రోమోని కట్ చేస్తూ గోపీచంద్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ప్రభాస్ ని అడ్డంగా బుక్ చేసేసాడు గోపీచంద్. మీ ఫ్రెండ్ ఇప్పుడే ఒక మాట చెప్పాడు బాలయ్య అనగానే ..రాణి గురించే కదా సార్ అంటూ ఓపెన్ అప్ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఆ రాణి ఎవరో అంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా ప్రశ్నలు వేసుకుంటున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఫోన్లో సేవ్ అయిన రాణి అనే పేరు ఎవరిదో కాదు దర్శకధీరుడు రాజమౌళి .

ఎస్ డార్లింగ్ అతని పేరును ముద్దుగా రాని అంటూ సేవ్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని పూర్తి ఎపిసోడ్లో రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా గోపీచంద్ సినీ కెరియర్ గురించి బాలయ్య అడిగి తెలుసుకున్న విధానం చాలా బాగా అనిపించింది . అంతేకాదు ఓ ఫోటోని చూపిస్తూ ప్రభాస్ ని ఇరుక్కుని పెట్టే ప్రశ్న వేశాడు బాలయ్య . ఈ క్రమంలోని ప్రభాస్ మాట్లాడిన తీరు జనాలని ఆకట్టుకునింది “సార్ మా అమ్మ చూస్తే టెన్షన్ పడిపోతుంది ..ఆ ఫోటో రిలీజ్ చేయండి.. ఈ సోషల్ మీడియాతో నేను వేగలేను సార్ “అంటూ చెప్పుకు రావడం చాలా ఫన్నీగా అనిపించింది. ప్రజెంట్ ఈ ప్రోమో సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే చిన్న ప్రోమోతోనే సోషల్ మీడియాని చెక్ చేసిన ప్రభాస్ పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే మాత్రం టీఆర్పీలు బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు . చూడాలి మరి ఏం జరగబోతుందో ప్రభాస్ బాలయ్యతో ఇంకా ఎన్ని విషయాలని పంచుకున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news