Moviesయంగ్ బ్యూటీ పై మోజు పడ్డ దిల్ రాజు.. కోట్లు ఇచ్చి...

యంగ్ బ్యూటీ పై మోజు పడ్డ దిల్ రాజు.. కోట్లు ఇచ్చి మరి కర్చీఫ్ వేసాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిస్టర్బ్యూటర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన దిల్ రాజు.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీని ఏలేసే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. దానికి ముఖ్య కారణం ఆయనకు ఉన్న తెలివితేటలు ..డెడికేషన్ అంటూ ఉంటారు ఆయన అభిమానులు. సినిమా కథను బట్టి సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ..ఓటీటీ లో రిలీజ్ చేస్తే బెటరా ..థియేటర్స్ లో రిలీజ్ చేస్తే బెటరా.. ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది అని చెప్పే సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ ప్రొడ్యూసర్ .

అంతేకాదు తాను సినిమా కథలను నమ్మి ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఆయనకు తెలిసి కూడా ప్రొడ్యూస్ చేశాడు. దానికి మెయిన్ రీజన్ ఆ కథ పట్ల ఆయన పెంచుకున్న ప్రేమ . కాగా రీసెంట్గా దిల్ రాజు మరో యంగ్ బ్యూటీ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . లవ్ టు డే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన పై ఇవానా పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మనసు పడ్డట్టు తెలుస్తుంది. ఆమె నటనకు దిల్ రాజు ఫిదా అయ్యాడట . ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజునే.

అయితే డైరెక్ట్ గా తెలుగు ద్వారా ఆమెను పరిచయం చేయడానికి దిల్ రాజు నాన్న రకాలుగా ప్రయత్నిస్తున్నాడట . దిల్ రాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆశీష్ రెడ్డితో రొమాంటిక్ ధిల్లర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది . ఇక్కడ ఈ సినిమాలో హీరోయిన్గా ఇవానాను ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మొదటి సినిమాకే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమె కాల్ షీట్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది . మొదటి సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చి దిల్ రాజు ఆమెను బుక్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news