Moviesబొమ్మ ప‌డ‌కుండానే ' హిట్ 2 ' కు దుమ్మురేపే వ‌సూళ్లు......

బొమ్మ ప‌డ‌కుండానే ‘ హిట్ 2 ‘ కు దుమ్మురేపే వ‌సూళ్లు… అడ‌వి శేష్ నువ్వు మామూలోడివి కాదు సామీ…!

టాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తెర‌కెక్కిన సినిమా హిట్ 2. శైలేష్ కొల‌ను తెర‌కెక్కించిన లేటెస్ట్ క్రైం థ్రిల్ల‌ర్ సినిమా హిట్ 2. హిట్ ఫ్రాంచైజ్‌లో రెండో సినిమాగా తెర‌కెక్కిన ఈ రోజు నుంచి థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు మంచి హైప్ అయితే ఉంది. ఈ హైప్‌కు త‌గ్గ‌ట్టుగానే ఓవ‌ర్సీస్‌లో అదిరిపోయే అడ్వాన్స్‌లు జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లోనే కేవ‌లం అడ్వాన్స్‌ల‌తోనే ల‌క్ష డాల‌ర్లు కొల్ల‌గొట్టేసింది. అయితే షోలు ప‌డే టైంకు 2 – 3 ల‌క్ష‌ల డాల‌ర్ల మ‌ధ్య‌లో ఈ సినిమా వ‌సూళ్లు ఉంటాయ‌ని తెలుస్తోంది.అంటే ఫ‌స్ట్ డే కంప్లీట్ అయ్యే స‌రికే హాఫ్ మిలియ‌న్ మార్క్ డాల‌ర్ల‌ను క్రాస్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని తెలుస్తోంది. ట్రేడ్ వ‌ర్గాలతో పాటు ప్రేక్ష‌కుల్లోనూ హిట్ 2పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు ఎంఎం శ్రీలేఖ – సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా వారు నిర్మాణం వహించారు. మ‌న టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నాడు. ఏదేమైనా అడ‌వి శేష్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంద‌నేందుకు ఈ అంకెలే నిద‌ర్శ‌నాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news