Moviesఈ హీరోయిన్ల కాస్ట్‌లీ విడాకులు... వీళ్ల భ‌ర‌ణం తెలిస్తే క‌ళ్లు జిగేల్...

ఈ హీరోయిన్ల కాస్ట్‌లీ విడాకులు… వీళ్ల భ‌ర‌ణం తెలిస్తే క‌ళ్లు జిగేల్ మ‌నాల్సిందే..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, బ్రేక‌ప్‌లు, విడాకులు కామ‌న్‌. సినిమా స్టార్లు కూడా తమ వైవాహిక జీవితంలో ఆనందంగా గడపాలని కోరుకుంటారు. కారణం ఏదైనా సినిమా స్టార్ల వైవాహిక బంధాలు సున్నితంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే పంతాలకు పట్టింపుల‌కు పోయి విడాకులు తీసుకుంటూ ఉంటారు. సమంత – నాగచైతన్య విడాకులకు నాలుగు నెలల ముందు వరకు కూడా గోవాలో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేశారు.

ఒకరుంటే ఒకరికి ఎంతో ప్రేమ అని చాటుకున్నారు. అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి హంగామానే కనిపించేది. అంత ఎంజాయ్ చేసిన జంట 4 నెలల తర్వాత విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడాకుల సమయంలో తమ స్టార్ చాలామంది భార్యలకు భారీ భరణం సమర్పించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసుకుందాం.

సైఫ్ ఆలీఖాన్ – అమృతాసింగ్ :
అస‌లు వీరి పెళ్లే పెద్ద సంచ‌ల‌నం. వ‌య‌స్సులో త‌న‌క‌న్నా 12 ఏళ్లు పెద్ద‌ది అయిన అమృత‌ను సైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాలా యేళ్లు ఈ జంట కాపురం చేసింది. వీరి కుమార్తె సోహా ఆలీఖాన్ ఇప్పుడు బాలీవుడ్‌లో యంగ్ క్రేజీ హీరోయిన్‌. క‌రీనా క‌పూర్‌ను పెళ్లాడేందుకు సైఫ్ అమృత‌కు విడాకులు ఇచ్చాడు. అయితే అప్ప‌టి వ‌ర‌కు అత‌డు సంపాదించిన దాంట్లో స‌గం మొత్తం ఆమెకు భ‌ర‌ణంగా ఇచ్చాడు. ఇది కొన్ని కోట్ల‌లో ఉంది.

హృతిక్ రోష‌న్ – సుసానే ఖాన్ :
హృతిక్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు సుసానేను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక 2014లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్ప‌ట్లోనే సుసానే రు. 400 కోట్ల భ‌ర‌ణం డిమాండ్ చేయ‌గా.. అందులో స‌గం ఇచ్చేందుకు హృతిక్ ఒప్పుకున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

మ‌లైకా అరోరా – అర్బాజ్ ఖాన్‌:
15 ఏళ్ల పాటు కాపురం చేసి ఓ బిడ్డ‌ను క‌న్నాక ఈ జంట విడాకులు తీసుకుంది. వీరి విడాకుల‌కు మ‌లైకా అర్జున్‌క‌పూర్‌తో ప్రేమ‌లో ఉండ‌డ‌మే. అయితే మ‌లైక భ‌ర‌ణం కోర‌క‌పోయ‌నా కూడా అర్బాజ్ ఆమెకు రు . 20 కోట్లు చెల్లించాడ‌ట‌.

సంజ‌య్ క‌పూర్ – క‌రిష్మా క‌పూర్ :
అభిషేక్ బ‌చ్చ‌న్‌తో ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే విడిపోయింది క‌రిష్మా క‌పూర్‌. ఆ త‌ర్వాత అమెరికా ఎన్నారై సంజ‌య్‌క‌పూర్‌ను పెళ్లాడి 14 ఏళ్లు కాపురం చేసి.. ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లి అయ్యాక విడాకులు ఇచ్చేసింది. క‌రిష్మా భ‌ర‌ణంగా ముంబైలో ఖ‌రీదైన ఇంటితో పాటు నెలా నెలా రు. 10 ల‌క్ష‌ల వ‌డ్డీ వ‌చ్చే ఆస్తులు, త‌న పిల్ల‌ల పేరిట రు. 14 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించుకుంది.

నాగ‌చైత‌న్య – స‌మంత :
ఇటీవ‌ల టాలీవుడ్‌లో విడిపోయిన జంట చైతు, స‌మంత‌. విడాకుల త‌ర్వాత అక్కినేని కుటుంబం.. స‌మంత‌కు రు. 200 కోట్ల భ‌ర‌ణం ఇచ్చింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే స‌మంత వీటిని ఖండించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news