Moviesసుకుమార్ బ్రతిమిలాడుకున్న "పుష్ప" లో నటించని తెలుగు హీరో..ఎందుకో తెలుసా..?

సుకుమార్ బ్రతిమిలాడుకున్న “పుష్ప” లో నటించని తెలుగు హీరో..ఎందుకో తెలుసా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక కథను రాసుకున్నప్పుడు ..ఒక హీరోని అనుకోని , ఊహించుకొని, పూర్తి చేసుకుంటాం. అయితే ఆ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత హీరోకి ఆ స్క్రిప్ట్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు.. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ స్క్రిప్ట్ ని వదులుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి . అయితే అలా వదులుకున్న స్క్రిప్ట్ పక్క హీరో చేసి బ్లాక్ బస్టర్ కొడితే ఆ బాధ వర్ణాతీతం .

అలాంటి బాధని అనుభవిస్తున్నాడు మహేష్ బాబు . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ దక్కించుకున్నాడు . అయితే సుకుమార్ మొదట ఈ సినిమాలో హీరోగా అనుకునింది అల్లు అర్జున్ ని కాదు అంటూ తెలుస్తుంది. ఈ కథను అనుకున్నప్పుడు మహేష్ బాబుని ” పుష్ప ” సినిమాలో హీరో గా అనుకున్నాడట .

అయితే స్టోరీ విన్న తర్వాత మహేష్ బాబు..” ఈ కథ నాకు సెట్ అవ్వదు అని ..సింగల్ లైన్ లోనే నో చెప్పేసాడట . దీంతో సుకుమార్ 2, 3 సార్లు మహేష్ బాబు ను ఒప్పించడానికి ట్రై చేసాడట. ఆయన మనసు మార్చుకోకపోవడంతో..చేసేదేమీ లేక బన్నీ ని అప్రోచ్ అయ్యి కధ చెప్పడం..షూట్ చేయడం.. విడుదల చేయడం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. త్వరలోనే పుష్ప2 గ్రాండ్గా మన ముందుకు రాబోతుంది . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news