Moviesకీర్తి అభిమానులకు బ్యాడ్ న్యూస్.. కొంప ముంచేసిందింగా..!!

కీర్తి అభిమానులకు బ్యాడ్ న్యూస్.. కొంప ముంచేసిందింగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు.. గెస్ చేయలేరు. స్టార్ గా ఉన్న వ్యక్తులు జీరో అవ్వడం ..జీరో గా ఉన్న హీరో ..స్టార్ అవడం ఓవర్ నైట్ లో జరిగిపోతూ ఉంటుంది. అయితే హీరోల పరిస్థితి ఎలా ఉన్నా.. హీరోయిన్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ అని చెప్పుకుంటున్న పలువురు హీరోయిన్స్ కెరియర్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా రాశిఖన్నా , తమన్నా , కీర్తి సురేష్ ఖాతాల్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎస్ మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కీర్తి సురేష్.. ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి క్రేజీ హిట్ అందుకోలేకపోయింది . సర్కారీ వారి పాట సినిమా హిట్ అయినా.. అది మొత్తం మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఇక ఆ తర్వాత కీర్తి సురేష్ హిట్ అందించలేకపోయింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఖాతాలో “భోళాశంకర్” సినిమా తప్పిస్తే తెలుగులో ఒక్క అవకాశం లేదు . దీంతో అందాల డోసులు పెంచుతూ.. ఎలాంటి రోల్స్కి అయిన రెడీ అన్నట్లు హింట్ ఇస్తుంది కీర్తి సురేష్ . అయితే కీర్తి సురేష్ ఖాతాలో ఇప్పటివరకు తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోని కీర్తి సురేష్ పూర్తి ఫోకస్ కోలీవుడ్ పై చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు అవకాశాలు వచ్చిన చోట నటనను ప్రూవ్ చేసుకోవాలని ..అవకాశాలు రానప్పుడు అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లకూడదని కీర్తి సురేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే కీర్తి సురేష్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు అభిమానులను హర్ట్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news