Moviesఎన్టీఆర్‌తో షూటింగ్‌.. కాలు జారిన జ‌య‌ప్ర‌ద‌.. షాకింగ్ క్లైమాక్స్‌...!

ఎన్టీఆర్‌తో షూటింగ్‌.. కాలు జారిన జ‌య‌ప్ర‌ద‌.. షాకింగ్ క్లైమాక్స్‌…!

ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించిన ముందు త‌రం హీరోయిన్ల‌లో జ‌య‌ప్ర‌ద ముందున్నారు. అనేక సినిమాల్లో హిట్ ఫెయిర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో జ‌యసుధ కాంబినేష‌న్‌కుఎలా అయితే..ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారో.. ఎన్టీఆర్‌-జ‌య‌ప్ర‌ద‌కు కూడా అంతే అభిమానం చూపించారు. అయితే.. శ్రీదేవి-ఎన్టీఆర్‌ల కాంబినేష‌న్ ఉంటే.. ఇక ప్రేక్ష‌కుల‌కు పండ‌గే.

ఆ హీరోయిన్ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ జోస్యం నిజమైందా.. ఏమైందంటే | jayaprada interesting comments about senior ntr goes viral in social media details, jayaprada, senior ntr, ntr shata jayanthi ...

జ‌య‌ప్ర‌ద – ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన స‌నిమాల్లో యాక్ష‌న్‌కు ఎక్కువ‌గా చోటుపెట్టిన సినిమాలు కూడా ఉన్నా యి. సూప‌ర్ మాన్ అని అన్న‌గారు న‌టించిన యాక్ష‌న్ సినిమా.. అప్ప‌ట్లో యూత్‌ను బాగా అల‌రించింది. ఈ సినిమాలో జ‌య‌ప్ర‌ద హీరోయిన్‌. అయితే.. ఒక సన్నివేశంలో ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టిస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా కాలు జారింది. ఇప్పుడంటే.. సెట్ లో ఫ‌స్ట్ ఎయిడ్ కిట్ ఉంటోంది. అప్ప‌ట్లో ఏమీ ఉండేవి కాదు.

Yamagola Telugu Full Movie - N T R, Jayaprada, Satyanarayana, Rao Gopal Rao, Jayamalini - YouTube

కాలి బొట‌న‌వేలు ద‌గ్గ‌ర నుంచి జ‌య‌ప్ర‌ద‌కు ర‌క్తం వ‌చ్చింది. త‌దుప‌రి షూటింగ్ ఆగిపోయింది. గాయ‌ప‌డిన జ‌య‌ప్ర‌ద కుర్చీలో కూర్చుని ఉండ‌గా.. బాయ్ ఫాన్ ప‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. ఇంత‌లో ఎటు నుంచి వ‌చ్చారో తెలియ‌దు కానీ.. ఎన్టీఆర్ జ‌య‌ప్ర‌ద జారి ప‌డిన‌ప్పుడు మాయ‌మై.. రెండు నిమిషాల్లోనే ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. చేతిలో గుప్పెడు ప‌సుపు.. ఓ పాత గుడ్డ‌.

“చూడ‌మ్మాయ్ .. కొంచెం చురుక్కు మంటుంది. త‌ర్వాత‌.. చ‌ల్లగా ఉంటుంది“ అంటూ.. కాలికి ప‌సుపు అద్దేసి.. గుడ్డ చుట్టేశారు. ఆ ఘ‌ట‌న అనూహ్యంగా జ‌ర‌గ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అన్న‌గారు ఏంటి.. త‌న స్థాయిని మ‌రిచిపోయి మ‌రీ ఇలా చేయ‌డ‌మేంట‌ని.. జ‌య‌ప్ర‌ద అయితే.. అన్న‌గారి కాళ్ల‌పై ప‌డిపోయింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news