Moviesనాగ‌చైత‌న్య - అఖిల్‌కు సినిమాలు ఇష్టం లేదా... అన్న‌ద‌మ్ముల షాకింగ్ డెసిష‌న్‌...!

నాగ‌చైత‌న్య – అఖిల్‌కు సినిమాలు ఇష్టం లేదా… అన్న‌ద‌మ్ముల షాకింగ్ డెసిష‌న్‌…!

అక్కినేని అభిమానుల‌కు గుండె ప‌గిలిపోయే న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. అస‌లు అక్కినేని హీరోల్లో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్ సినిమాలు ఇటీవ‌ల కాలంలో ఏవీ స‌రిగా ఆడ‌ట్లేదు. నాగ్ సోగ్గాడే చిన్ని నాయ‌నా, బంగార్రాజు మిన‌హా అన్ని సినిమాలు డిజాస్ట‌ర్లే. సోలోగా నాగ్ ఎన్ని సినిమాలు చేస్తుంటే అవ‌న్నీ అంత‌కు మించి ఘోరంగా దెబ్బ‌తింటున్నాయి. అస‌లు అఖిల్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఏడేళ్లు అవుతున్నా అన్నీ ఘోర‌మైన ఎదురు దెబ్బ‌లే..!

బ్యాచిల‌ర్ ఓ మోస్త‌రుగా మాత్ర‌మే ఆడింది. అది కూడా గొప్ప టాక్ తెచ్చుకోలేదు. ఏజెంట్ రెండేళ్లుగా ఊరిస్తూ వ‌స్తోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌ట్లేదు. బ‌డ్జెట్ కూడా పూర్తిగా కంట్రోల్ త‌ప్పేసిందంటున్నారు. సినిమాపై ఎవ్వ‌రికి న‌మ్మ‌కాలు కుద‌ర‌డం లేదు. ఇక చైతు కాస్త ప‌ర్వాలేద‌నిపించినా అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చ‌ద్దా సినిమాతో పాటు థ్యాంక్యూ సినిమాలు డిజాస్ట‌ర్ అయిపోయాయి.

వాస్త‌వానికి చైతుకు హిట్స్ ప‌డ్డాయి. అయినా ఎందుకో మిడిల్ రేంజ్‌లో కూడా స్టార్ హీరో కాలేక‌పోయాడు. ఈ కుటుంబంలో ఏఎన్నార్‌, నాగార్జున ఇద్ద‌రూ కూడా ఫ్యాష‌నేట్‌గానే సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. ఇదే కుటుంబం నుంచి వ‌చ్చిన సుమంత్‌, సుశాంత్ ఇద్ద‌రూ క్లిక్ కాక‌పోయినా కూడా ఫ్యాష‌నేట్‌గానే సినిమాలు చేశారు. అయితే చైతు, అఖిల్ ఫ్యాష‌నేట్‌గానే సినిమాల్లోకి రాలేద‌ట‌.

అస‌లు వీరికి ముందు నుంచి సినిమాలు చేయ‌డం ఇష్టం లేద‌ని టాక్ ? చైతుకు కార్ రేసింగ్ అంటే బాగా ఇష్టం. కార్ రేసింగ్‌లో ఇండియా స్థాయి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అయితే నాగార్జున బ‌ల‌వంతంగా చైతును హీరోను చేశాడు. కొన్ని హిట్లు వ‌చ్చినా ఇప్ప‌ట‌కీ క‌థ‌ల‌పై స‌రైన ప‌ట్టులేదు. ఒక్కోసారి ఏ క‌థ‌లు ఎంచుకుంటాడో ? తెలియ‌ట్లేదు. వ‌చ్చిన హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయ‌క‌పోవ‌డం మైన‌స్ అయితే.. స‌రిగా కాన్‌సంట్రేష‌న్ కూడా ఉన్న‌ట్టు లేదు.

ఇక అఖిల్‌కు హీరో అవ్వ‌డం అస్స‌లు ఇష్టం లేద‌ట‌. అమ‌ల‌, నాగార్జున బ‌ల‌వంతం మీదే హీరోను చేశారని అంటారు. అఖిల్‌కు ఇప్ప‌ట‌కీ స‌రైన హిట్ ప‌డ‌లేదు. అస‌లు ఏజెంట్ రిలీజ్ అవుతుందా ? అన్న న‌మ్మ‌కాలే లేవు. రిలీజ్ అయినా హిట్ అవుతుంద‌న్న గ్యారెంటీ, న‌మ్మ‌కాలు అక్కినేని అభిమానుల‌కే లేవు. అఖిల్‌కు క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ బాగా ఆడ‌తాడు. ఇప్పుడు సినిమాల్లోకి వ‌చ్చాక సినిమానే కెరీర్‌గా మ‌లుచుకోవాల్సింది పోయి.. ఓ వైపు సినిమా షూటింగ్ జ‌రుగుతుంటే ఇటు గ్యాప్‌లో వ‌చ్చి క్రికెట్ చూస్తూ ఉంటాడ‌ట‌.

వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రుగుతున్నా, ఐపీఎల్ జ‌రుగుతున్నా సినిమా క‌న్నా కూడా ఇటు వైపే ఇంట్ర‌స్ట్‌గా ఉంటాడ‌ని అంటారు. అస‌లు క‌థ‌లు విన‌డానికి కూడా అఖిల్‌కు స‌రైన టైం ఉండదేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అఖిల్‌కు క‌ష్టం విలువ తెలియ‌ట్లేద‌ని.. వాళ్ల తాత‌, నాన్న ఇచ్చిన ఆ బ్రాండ్‌తో ఏదో నెట్టుకువ‌స్తున్నా ఇక‌పై అయినా సినిమా లోకంలో బ‌త‌కాల‌న్న కాంక్ష లేక‌పోతే త్వ‌ర‌గానే ఫేడ‌వుట్ అయిపోయి మ‌రో సుమంత్‌, సుశాంత్‌లా అయిపోతాడ‌నే అంటున్నారు.

ఇక చైతు, అఖిల్ ఇద్ద‌రి ప‌ర్స‌న‌ల్‌గా కూడా బ్రేక‌ప్‌లు ఉన్నాయి. చైతుకు పెళ్ల‌య్యాక స‌మంత‌తో బ్రేక‌ప్ అయ్యింది. అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయ్యాక బ్రేక‌ప్ అయ్యింది. ఇలాంటి టైంలో వీరు సినిమా కెరీర్‌లో.. అందులోనూ ఈ పోటీ ప్ర‌పంచంలో ముందుండాలంటే ముందుగా క‌థ‌ల ఎంపిక‌తో పాటు స్క్రిఫ్ట్‌పై ప‌ట్టు దొర‌క‌బుచ్చుకుంటేనే లైఫ్ ఉంటుంద‌ని.. లేక‌పోతే అక్కినేని బ్రాండ్ త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కూడా అవుతుంద‌న్న చ‌ర్చ‌లే ఎక్కువుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news