Moviesనందమూరి ఫ్యాన్స్ కి గాల్లో ఎగిరి గంతేసే న్యూస్.. బ్లాస్టింగ్ అప్డేట్...

నందమూరి ఫ్యాన్స్ కి గాల్లో ఎగిరి గంతేసే న్యూస్.. బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్..!!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. స్టార్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్లో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమా ..ఇప్పటివరకు పూజా కార్యక్రమాలను కూడా మొదలు పెట్టలేదు . ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియదు . ఏదో తూతూ మంత్రంగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కానీ ..అప్పటినుంచి ఇప్పటివరకు కొరటాల కానీ ఎన్టీఆర్ కానీ ..చిత్ర బృందం కానీ ఈ సినిమాపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు . ఈ క్రమంలోనే మిగతా ఫ్యాన్స్ అందరూ తమ హీరోల సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే నందమూరి ఫ్యాన్స్ మాత్రం డీలా పడిపోతున్నారు.

ఇలాంటి క్రమంలోని నందమూరి అభిమానులకు మంచి కిక్కెక్కించే క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే తెరపై నందమూరి బాలకృష్ణ ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి జంట ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో మనకు తెలియనది కాదు. వీళ్ళు కలిసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది . తెరపై వీళ్ల జంట కనిపిస్తే ఆటోమేటిక్గా జనాలకు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు . అలా నటించే వారు కాదు కాదు జీవించేవారు ..అంతలా తెరపై ఈ జంట ప్రత్యేక గుర్తింపు పొంది .

కాగా తాజాగా చాన్నాళ్ల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విజయశాంతి.. మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించి మెప్పించింది. ఇదే క్రమంలో ఇప్పుడు కొరటాల ..ఎన్టీఆర్ థర్టీ సినిమా కోసం ఆమెను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది . ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వచ్చిన పాత్రలు చేస్తున్న విజయశాంతి.. త్వరలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమాలో తారక్ కి తల్లిగా నటించబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది .

అంతేకాదు ఇప్పటికే విజయశాంతిని అప్రోచ్ అయిన కొరటాల కథ వివరించగా ఓకే చెప్పి అగ్రిమెంట్ పేపర్ పై కూడా సైన్ చేసిందట. తారక్ కూడా విజయశాంతి తన సినిమాలో నటించాడానికి ఓకే చెప్పడం పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటూ తెలుస్తుంది . అన్ని మంచి విషయాలు జరుగుతున్నా సరే ఎందుకో కొరటాల ఈ సినిమాను స్టార్ట్ చేయలేకపోతున్నాడు. మంచి ముహూర్తం చూసి త్వరగా పనులు ప్రారంభించేస్తే నందమూరి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు . చూడాలి మరి బాబాయ్ తో ఆడి పాడి అలరించిన విజయశాంతి ..అబ్బాయితో తల్లిగా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news