Moviesగోపీచంద్ కి అంత సీన్ లేదు..? అందుకే ప్రభాస్ కి తోకగా...

గోపీచంద్ కి అంత సీన్ లేదు..? అందుకే ప్రభాస్ కి తోకగా వచ్చాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ మరింత ఎక్కువగా అయిపోయింది . అంతకు ముందు సెలబ్రిటీస్ లైఫ్ కి ప్రైవసీ ఉండేది . సోషల్ మీడియా పుణ్యమా అంటూ పరసనల్ లైఫ్ కాస్త పబ్లిక్ అయిపోయింది . అంతేకాదు సమయం సందర్భం లేకుండా ప్రతి మాటను ప్రతి ఇంటర్వ్యూను ట్రోల్ చేస్తూనే ఉన్నారు ట్రోలర్స్. కాగా రీసెంట్గా టాలీవుడ్ మ్యాంచో హీరో గోపీచంద్ ట్రోలర్ కు బలైపోయాడు. దారుణమైన ట్రోలింగ్ బాధలకు గురవుతున్నాడు.

మనకు తెలిసిందే గోపీచంద్ కెరియర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఈ హీరో ప్రజెంట్ మినిమం హీరోగా కూడా లేరు. దానికి కారణం పెరిగిపోతున్న కాంపిటీషన్ కి కొత్త నటుల ధాటికి గోపీచంద్ తట్టుకోకపోవడమే. కాగా రీసెంట్గా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గోపీచంద్ గెస్ట్ గా వచ్చాడు. ఆయనతో పాటు ప్రభాస్ కూడా వచ్చారు. అయితే దీన్నే క్యాచ్ చేసిన నెటిజన్స్ కొందరు గోపీచంద్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు .

గోపీచంద్ ని సింగిల్ గా పిలిస్తే అంత అన్ స్టాపబుల్ షో టీఆర్పిస్ దెబ్బతింటాయి అని.. అందుకే ప్రభాస్ కి తోకగా ఆయన పేరు చెప్పుకొని అన్ స్టాపబుల్ షో కి వచ్చాడు అంటూ కొందరు కావాలనే ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ – గోపీచంద్ ఫాన్స్ అయితే వాళ్ళకి ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు . నిజమైన ఫ్రెండ్షిప్ అంటే అది.. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలు లేకపోయినా పద్ధతిగా నిజాయితీగా బతికాడు గోపీచంద్.. అలాంటి నటుడు ఇండస్ట్రీలో హీరోగా ఉండాలి . ప్రభాస్ – గోపీచంద్ ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే . పని పాట లేని వాళ్ళు ట్రోలింగ్ ఆపేస్తే మంచిది అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సరే గోపీచంద్ ని ప్రభాస్ తోక అనడం ఆయన ఫ్యాన్స్ కు హర్టింగ్ గా అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news