Moviesవయసు కూడా చూడకుండా దారుణం..అన్నపూర్ణమ్మ జబర్ధస్త్ లోకి వచ్చి పరువు పొగొట్టుకుందా..?

వయసు కూడా చూడకుండా దారుణం..అన్నపూర్ణమ్మ జబర్ధస్త్ లోకి వచ్చి పరువు పొగొట్టుకుందా..?

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలువురు స్టార్ హీరోలకి అమ్మ పాత్రలో ..ఆ తర్వాత అమ్మమ్మ పాత్రలో ..భామపాత్రలో మెరిసిన ఈవిడ ఒకప్పుడు ఇండస్ట్రీని తన నటనతో ఊపేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రజెంట్ వయసు అయిపోయిన అన్నపూర్ణమ్మ తనదైన స్టైల్ లో చిన్నాచితక పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పరువు పోగొట్టుకుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మనకు తెలిసిందే బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ..అన్ని బూతు పదాలు కూడా తిట్టించుకుంటుంది. షోలో మరీ ముఖ్యంగా వల్గారిటీ ఎక్కువగా ఉంటుంది.. అని డబుల్ మీనింగ్ పంచెస్ .. అస్సలు భరించలేమని చెప్పుకొస్తూ ఉంటారు కొందరు జనాలు . ఇదే క్రమంలో ఇప్పటికే పలు సార్లు జబర్దస్త్ లో మెరిసిన అన్నపూర్ణమ్మ.. ఇప్పుడు రాంప్రసాద్ టీం లో మెంబర్గా కామెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదే క్రమంలో ఆమె మాట్లాడే మాటలు వయసుకు ఏ సంబంధం లేదు అంటూ కొందరు జనాలు మండిపడుతున్నారు. అఫ్కోర్స్ అది ఆమె కావాలని మాట్లాడిన మాటలు కాదు.. జబర్దస్త్ వాళ్ల స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంది. వాళ్ళు ఆమె వయసు ను దృష్టిలో పెట్టుకొని స్కిట్స్ లో ఆమెను ఉపయోగిస్తే బాగుంటుంది ..ఇలాంటి డబుల్ మీనింగ్ పంచెస్ ఆమె నోట వింటే చాలా ఎబ్బెటు గా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు జబర్దస్త్ లోకి వచ్చి ఆమె తన పరువుని పొగొట్టుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు నెటిజన్స్. కొందరు జబర్ధస్త్ లోకి వచ్చి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంటే .. మరోపక్క సీనియర్స్ ని దిగజార్చిన షో గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనిపై అన్నపూర్ణమ్మ ఎలా స్పందిస్తుందో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news