Movies"ఓవర్ చేస్తే బెండు తీసెస్తా"..వరలక్ష్మికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..!?

“ఓవర్ చేస్తే బెండు తీసెస్తా”..వరలక్ష్మికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..!?

కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి. ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టడం చాలా కష్టం. అదే జయమ్మ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలో నటించిన పేరుతోనే పాపులారిటీ సంపాదించుకుని స్టార్ట్ గా మారిపోయింది. వరలక్ష్మి ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని అడుగు పెట్టింది . అయితే ఆమె బాడీ , ఫిజిక్ చూసి డైరెక్టర్ ఆమెకు హీరోయిన్ గా కన్నా నెగటివ్ రోల్స్ బాగా సెట్ అవుతాయని అటువైపుగా మళ్ళిచ్చారు.

క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎలాంటి పాజిటివ్ కామెంట్స్ వినిపించుకుందో అందరికీ తెలిసిందే . కాగా ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరక్కుతున్న వీరసింహారెడ్డి. సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది వరలక్ష్మి. అంతేకాదు త్వరలోనే తెరకెక్కుతున్న ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో కూడా వరలక్ష్మి కీలకపాత్రలో నటించబోతుంది అంటూ వైరల్ గా మారింది .

ఇలాంటి క్రమంలోని బాలయ్య-వరలక్ష్మి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కుదిరినట్లు తెలుస్తుంది. ఈ చనువుతోనే అనిల్ రావిపూడి సినిమాలో కూడా వరలక్ష్మి కీలక రోల్ చేయాలని బాలయ్య అడిగారట . దీంతో వరలక్ష్మి నాకు కాల్ షీట్స్ ఫుల్ అయిపోయాయి అని సరదాగా చెప్పగా .. బాలయ్య కూడా అంతే సరదాగా..”మొదట నా సినిమా..ఆ తరువాతే ఎవ్వరైనా.. నా సినిమా చేయకపోతే బండి తీసేస్తా ..తెలుసు కదా ..”అంటూ ఫన్నీగా మాట్లాడుకున్నారట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే బాలయ్య లాంటి సీనియర్ సీరియస్ హీరోతో ఇలా సరదాగా మాట్లాడే అంత చనువు దక్కించుకోవడం చాలా గ్రేట్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . చూడాలి మరి తెరపై వీరిద్దరి స్క్రీన్ స్పేస్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news